Bichagadu 2 Day 5 Collections: బిచ్చగాడు సంచలన రికార్డు.. అన్ని కోట్లు టార్గెట్ ఔట్.. ఫస్ట్ మూవీ ఇదే

కొద్ది రోజులుగా సౌతిండియా మారుమ్రోగిపోతోన్న సినిమా పేర్లలో 'బిచ్చగాడు 2' ఒకటి. అంతలా ఇది విడుదలకు ముందూ.. ఆ తర్వాత తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోంది. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. అదిరిపోయే కలెక్షన్లను రాబడుతూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా తమిళంలో కంటే తెలుగులోనే ఇది ఎక్కువ వసూళ్లను అందుకుంటోంది. తద్వారా తాజాగా ఈ చిత్రం టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో 'బిచ్చగాడు 2' మూవీ ఐదు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

'బిచ్చగాడు 2' అరాచకంగా:విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'బిచ్చగాడు 2'. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే మ్యూజిక్ కూడా ఇచ్చాడు.

Vijay Antony Starrer Bichagadu 2 Movie 5 Days Worldwide Official Collections

బిచ్చగాడు 2 బిజినెస్ వివరాలు :హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'బిచ్చగాడు 2'పై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు వరకూ వ్యాపారాన్ని జరుపుకుంది.

5వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:'బిచ్చగాడు 2' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 5వ రోజు వసూళ్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 15 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 46 లక్షలు షేర్, రూ. 70 లక్షలు గ్రాస్ వచ్చింది.

Vijay Antony Starrer Bichagadu 2 Movie 5 Days Worldwide Official Collections

5 రోజులకూ కలిపి ఎంతొచ్చింది:5 రోజులూ 'బిచ్చగాడు 2'కి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 2.29 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.14 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.09 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 56 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, గుంటూరులో రూ. 57 లక్షలు, కృష్ణాలో రూ. 53 లక్షలు, నెల్లూరులో రూ. 34 లక్షలతో కలిపి.. రూ. 6.93 కోట్లు షేర్, రూ. 12.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vijay Antony Starrer Bichagadu 2 Movie 5 Days Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:ఏపీ, తెలంగాణలో రూ. 12.20 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో తమిళనాడులో రూ. 11.05 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.00 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో రూ. 12.42 కోట్లు షేర్‌, రూ. 25.25 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

Vijay Antony Starrer Bichagadu 2 Movie 5 Days Worldwide Official Collections

తెలుగులో హిట్.. అక్కడ మత్రం:'బిచ్చగాడు 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.00 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 12.42 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 3.58 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ అవుతుంది. తెలుగులో రూ. 6.50 కోట్లు టార్గెట్‌కు రూ. 6.93 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 43 లక్షలు లాభం వచ్చింది.

Vijay Antony Starrer Bichagadu 2 Movie 5 Days Worldwide Official Collections

తెలుగులో ఫస్ట్ మూవీగా రికార్డు:విజయ్ ఆంటోనీ - కావ్య తాపర్ జంటగా నటించిన 'బిచ్చగాడు 2' మూవీ తెలుగులో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. దీంతో ఇది క్లీన్ హిట్‌గా నిలిచింది. తద్వారా ఈ ఏడాది మేలో హిట్టైన ఏకైక తెలుగు సినిమాగా ఇది రికార్డును క్రియేట్ చేసింది. అలాగే, ఈ ఏడాది విజయం సాధించిన 11వ సినిమాగానూ ఘనతను అందుకుంది. కానీ, తమిళంలో ఇంకా పోరాడుతూనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X