Bichagadu 2 Day 8 Collections: బిచ్చగాడుకు షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు.. లాభాలతో నయా రికార్డు
గతంలో కంటే ఇప్పుడు తెలుగులోకి తమిళ సినిమాలు ఎక్కువగా డబ్బింగ్ అవుతున్నాయి. అలా వచ్చిన చిత్రాల్లో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుని సక్సెస్ అవుతోన్నాయి. అందులో 2016లో వచ్చిన 'బిచ్చగాడు' ఒకటి.
అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా వచ్చిందే 'బిచ్చగాడు 2'. దీనికి కూడా తెలుగు ఆడియెన్స్ మంచి స్పందనను అందించారు. ఫలితంగా ఇది టార్గెట్‌ను చేరి లాభాలను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో 'బిచ్చగాడు 2' 8 రోజుల రిపోర్టును మీరే చూసేయండి!

'బిచ్చగాడు 2'తో వచ్చేశారు: విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'బిచ్చగాడు 2'. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే మ్యూజిక్ కూడా ఇచ్చాడు.

బిచ్చగాడు 2 బిజినెస్ వివరాలు: సూపర్ హిట్ మూవీకి కొనసాగింపుగా వచ్చిన 'బిచ్చగాడు 2'పై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు వరకూ బిజినెస్ జరుపుకుంది.

8వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: ఆంధ్రా, తెలంగాణలో 'బిచ్చగాడు 2' మూవీకి 8వ రోజు వసూళ్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 15 లక్షలు షేర్, రూ. 30 లక్షలు గ్రాస్ వచ్చింది.

8 రోజులకూ కలిపి ఎంతొచ్చింది: 8 రోజుల్లో 'బిచ్చగాడు 2'కి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 2.49 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.23 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.19 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 45 లక్షలు, గుంటూరులో రూ. 64 లక్షలు, కృష్ణాలో రూ. 59 లక్షలు, నెల్లూరులో రూ. 38 లక్షలతో కలిపి.. రూ. 7.60 కోట్లు షేర్, రూ. 13.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఏపీ, తెలంగాణలో రూ. 13.40 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో తమిళనాడులో రూ. 12.35 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.07 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో రూ. 13.77 కోట్లు షేర్, రూ. 27.92 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

తెలుగులో హిట్.. అక్కడ మత్రం: 'బిచ్చగాడు 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.00 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లో దీనికి రూ. 13.77 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.23 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ అవుతుంది. తెలుగులో రూ. 6.50 కోట్లు టార్గెట్‌కు రూ. 7.60 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 1.10 కోట్లు లాభం వచ్చింది.


Click it and Unblock the Notifications











