Bichagadu 2 Day 9 Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. 9 రోజుల్లోనే అన్ని కోట్లు.. టోటల్ లాభమెంతంటే!

ఈ మధ్య కాలంలో సెన్సేషన్ అవుతోన్న చిత్రాల్లో 'బిచ్చగాడు 2' ఒకటి. అంతలా ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు మారుమ్రోగిపోతోంది. 2016లో వచ్చిన సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న 'బిచ్చగాడు'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ.. ఏకకాలంలో తెలుగు, తమిళంలో విడుదలైంది. అయితే, మాతృభాషలో కంటే ఇక్కడే ఈ సినిమాకు ఎక్కువ రెస్పాన్స్ వచ్చి క్లీన్ హిట్ అయింది. ఈ క్రమంలోనే శనివారం ఈ చిత్రానికి వసూళ్లు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలో 'బిచ్చగాడు 2' 9 రోజుల్లో తెలుగు, తమిళంలో ఎంత మేర రాబట్టిందో మీరే చూసేయండి!

'బిచ్చగాడు 2' అంటూ ఎంట్రీ: కోలీవుడ్ సెన్సేషన్ విజయ్ ఆంటోనీ హీరోగా, దర్శకుడిగా చేసిన సినిమానే 'బిచ్చగాడు 2'. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే మ్యూజిక్ కూడా ఇచ్చాడు. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దీన్ని ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు.

Bichagadu 2

బిచ్చగాడు 2 బిజినెస్ వివరాలు: క్రేజీ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన 'బిచ్చగాడు 2'పై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు వరకూ బిజినెస్‌ను చేసుకుంది.

9వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:ఆంధ్రా, తెలంగాణలో 'బిచ్చగాడు 2' మూవీకి 9వ రోజు వసూళ్లు బాగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 13 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 23 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వచ్చింది.

Bichagadu 2

9 రోజులకూ కలిపి ఎంతొచ్చింది: 9 రోజుల్లో 'బిచ్చగాడు 2'కి తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 2.62 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.25 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.21 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 65 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 46 లక్షలు, గుంటూరులో రూ. 65 లక్షలు, కృష్ణాలో రూ. 60 లక్షలు, నెల్లూరులో రూ. 39 లక్షలతో కలిపి.. రూ. 7.83 కోట్లు షేర్, రూ. 13.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఏపీ, తెలంగాణలో రూ. 13.85 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో తమిళనాడులో రూ. 13.00 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.10 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో రూ. 14.37 కోట్లు షేర్‌, రూ. 29.10 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

Bichagadu 2

టార్గెట్ ఎంత? లాభం ఎంత?: 'బిచ్చగాడు 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.00 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 14.37 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.63 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ అవుతుంది. తెలుగులో రూ. 6.50 కోట్లు టార్గెట్‌కు రూ. 7.83 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 1.33 కోట్లు లాభం వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X