Bichagadu 2 Day 1 Collections: దంచికొట్టిన బిచ్చగాడు.. ఒక్కరోజే అన్ని కోట్లు.. ఆ హీరోల కంటే ఎక్కువే

'బిచ్చగాడు'.. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏ రేంజ్‌లో ప్రభావాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'బిచ్చగాడు 2'ను తెరకెక్కించారు. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే తెలుగు, తమిళంలో అత్యధిక థియేటర్లలో ఇది విడుదలైంది. దీనికి మొదటి రోజు భారీ వసూళ్లు దక్కాయి. ఈ నేపథ్యంలో 'బిచ్చగాడు 2' ఫస్ట్ డే రిపోర్టు మీకోసమే!

మరోసారి వచ్చిన 'బిచ్చగాడు':విజయ్ ఆంటోనీ హీరోగా నటించి స్వయంగా తెరకెక్కించిన సినిమానే 'బిచ్చగాడు 2'. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన దీన్ని ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు. ఇందులో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే మ్యూజిక్‌ను కూడా అందించాడు.

Vijay Antony Starrer Bichagadu 2 Movie Day 1 Worldwide Official Collections

బిచ్చగాడు 2 బిజినెస్ వివరాలు :ఫస్ట్ పార్టకు సంచలన వసూళ్లు రావడంతో 'బిచ్చగాడు 2' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు వరకూ వ్యాపారాన్ని చేసుకుంది.

Vijay Antony Starrer Bichagadu 2 Movie Day 1 Worldwide Official Collections

అలాంటి టాక్... వసూళ్లు ఇలా:ఎన్నో అంచనాల నడుమ విడుదలైన విజయ్ ఆంటోనీ 'బిచ్చగాడు 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ఆశించిన రీతిలో రెస్పాన్స్ దక్కదని అంతా అనుకున్నారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మంచి స్పందనను సొంతం చేసుకుంది. దీంతో దీనికి భారీ స్థాయిలో వసూళ్లు దక్కాయి.

Vijay Antony Starrer Bichagadu 2 Movie Day 1 Worldwide Official Collections

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?:'బిచ్చగాడు 2' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 75 లక్షలు, సీడెడ్‌లో రూ. 36 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 33 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 14 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 11 లక్షలతో కలిపి.. రూ. 2.32 కోట్లు షేర్, రూ. 4.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vijay Antony Starrer Bichagadu 2 Movie Day 1 Worldwide Official Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:ఆంధ్రా, తెలంగాణలో భారీగా రూ. 2.32 కోట్లు రాబట్టిన 'బిచ్చగాడు 2' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో తమిళనాడులో రూ. 3.05 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 50 లక్షలు గ్రాస్ రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 4.00 కోట్లు షేర్‌, రూ. 8.15 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

Vijay Antony Starrer Bichagadu 2 Movie Day 1 Worldwide Official Collections

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?:ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన 'బిచ్చగాడు 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.00 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 4.00 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 12 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

Vijay Antony Starrer Bichagadu 2 Movie Day 1 Worldwide Official Collections

ఆ సినిమాల కంటే ఎక్కువగా:సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'బిచ్చగాడు 2' మూవీకి అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్సే అందుకుంది. దీంతో ఈ చిత్రం మొదటి రోజే రూ. 2.32 కోట్లు వసూలు చేసింది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగు చిత్రాల కలెక్షన్ల కంటే ఎక్కువే అని చెప్పాలి. అంతేకాదు, ఈ చిత్రం తమిళనాడులో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే కోటి రూపాయలు గ్రాస్ ఎక్కువ రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X