Bichagadu 2 Day 2 Collections: 2వ రోజూ కుమ్మేసిన బిచ్చగాడు.. అప్పుడే అన్ని కోట్లు.. ఇంకెంత రావాలంటే!
ఒకప్పుడు ఇండియాలో బాలీవుడ్‌నే పెద్ద ఇండస్ట్రీగా చెప్పుకునేవారు. కానీ, ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ వరల్డ్ వైడ్‌గా పెరిగిపోయింది. దీంతో మన భాషలోకి సినిమాలను రిలీజ్ చేయడానికి వేరే ఇండస్ట్రీల వాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఇప్పుడు తెలుగులో గ్రాండ్‌గా విడుదలైన చిత్రమే 'బిచ్చగాడు 2'. 2016లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'బిచ్చగాడు'కు ఇది సీక్వెల్‌గా రావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే రెస్పాన్స్ భారీగా వచ్చి దీనికి కలెక్షన్లు పోటెత్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బిచ్చగాడు 2' 2 రోజుల రిపోర్టు మీకోసమే!
'బిచ్చగాడు 2' అంటూ ఎంట్రీ: విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన క్రేజీ సినిమానే 'బిచ్చగాడు 2'. సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన దీన్ని ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు. ఇందులో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే సంగీతాన్ని కూడా సమకూర్చాడు.

బిచ్చగాడు 2 బిజినెస్ వివరాలు: హిట్ సినిమా సీక్వెల్ కావడంతో 'బిచ్చగాడు 2' మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు వరకూ వ్యాపారాన్ని జరుపుకుందని ట్రేడ్ సమాచారం.
2వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: 'బిచ్చగాడు 2' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజూ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 58 లక్షలు, సీడెడ్‌లో రూ. 28 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి.. రూ. 1.62 కోట్లు షేర్, రూ. 3.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకూ కలిపి ఎంతొచ్చింది: 'బిచ్చగాడు 2' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులూ మంచి స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 1.32 కోట్లు, సీడెడ్‌లో రూ. 64 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 59 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 35 లక్షలు, కృష్ణాలో రూ. 30 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో కలిపి.. రూ. 3.95 కోట్లు షేర్, రూ. 7.25 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:
తెలుగు రాష్ట్రాల్లో భారీగా రూ. 7.25 కోట్లు రాబట్టిన 'బిచ్చగాడు 2' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో తమిళనాడులో రూ. 5.75 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 65 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 65 లక్షలు గ్రాస్ రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 7.00 కోట్లు షేర్, రూ. 14.30 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. ఎంత రావాలి?: 'బిచ్చగాడు 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.00 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 7.00 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 9 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ అవుతుంది. తెలుగులో రూ. 6.50 కోట్లు టార్గెట్‌కు రూ. 3.95 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 2.55 కోట్లు రావాలి.


Click it and Unblock the Notifications











