Bichagadu 2 Day 3 Collections: బ్రేక్ ఈవెన్‌కు చేరువగా బిచ్చగాడు.. 3 రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

2016లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'బిచ్చగాడు' బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా సీక్వెల్‌గా బిచ్చగాడు 2 రావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు అంచనాలకు అనుగుణంగానే రెస్పాన్స్ భారీగా వచ్చింది. ఇక ఈ సినిమా మూడవ రోజు ఎంత కలెక్ట్ చేసింది? సక్సెస్ కావాలి అంటే ఇంకా ఎంత రావాలి అనే వివరాల్లోకి వెకితే..

'బిచ్చగాడు 2' బిజినెస్: సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ హీరోగా నటించడమే కాకుండా తన దర్శకత్వంలో వచ్చిన క్రేజీ సినిమానే 'బిచ్చగాడు 2'. ఇక ఈ సినిమాను ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు. ఇందులో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించారు.

 Vijay Antony Starrer Bichagadu 2 Movie Day 3 Worldwide Official Collections

ఇక ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. డిమాండ్ కు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు వరకూ వ్యాపారాన్ని జరుపుకుందని సమాచారం.

3వ రోజు ఎంతొచ్చింది?: 'బిచ్చగాడు 2' సినిమా ఆంధ్రా, తెలంగాణలో 3వ రోజూ ఆదివారం కావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. ఫలితంగా నైజాంలో రూ. 58 లక్షలు, సీడెడ్‌లో రూ. 28 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 26 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, గుంటూరులో రూ. 11 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి.. రూ. 1.62 కోట్లు షేర్, రూ. 3.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

 Vijay Antony Starrer Bichagadu 2 Movie Day 3 Worldwide Official Collections

3 రోజులకు వచ్చిన లెక్క: 'బిచ్చగాడు 2' సినిమాకు ఆంధ్ర నైజాంలో 3 రోజులూ మంచి స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 1.32 కోట్లు, సీడెడ్‌లో రూ. 64 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 59 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 35 లక్షలు, కృష్ణాలో రూ. 30 లక్షలు, నెల్లూరులో రూ. 19 లక్షలతో కలిపి.. రూ. 3.95 కోట్లు షేర్, రూ. 7.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

 Vijay Antony Starrer Bichagadu 2 Movie Day 3 Worldwide Official Collections

వరల్డ్ వైడ్ కలెక్షన్స్: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా రూ. 7.25 కోట్లు రాబట్టిన 'బిచ్చగాడు 2' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక తమిళనాడులో రూ. 5.75 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 65 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 65 లక్షలు గ్రాస్ రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.00 కోట్లు షేర్‌, రూ. 20.30 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

 Vijay Antony Starrer Bichagadu 2 Movie Day 3 Worldwide Official Collections

టార్గెట్ ఫినిష్ అవ్వాలి అంటే: బిచ్చగాడు 2' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.00 కోట్లు మేర బిజినెస్ చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.00 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 12.05 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 5 కోట్లు రాబడితేనే ఈ మూవీ హిట్ అవుతుంది. తెలుగులో రూ. 6.50 కోట్లు టార్గెట్‌కు రూ. 4.95 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 1.55 కోట్లు రావాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X