Bichagadu 2 Worldwide Bussiness: బిచ్చగాడు 2 ఫైనల్ టార్గెట్ ఫిక్స్ అయ్యింది.. మొత్తం ఎంత రావాలంటే?
మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్న విజయ్ ఆంటోని అనంతరం హీరోగా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకొన్న ఈ మల్టీటాలెంటేడ్ యాక్టర్ ఇప్పుడు దర్శకుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. బిచ్చగాడు 2 (తమిళంలో "పిచైక్కారన్ 2") అనే సినిమా మే 16వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ ఏ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..
అప్పట్లో వచ్చిన కలెక్షన్స్:2016లో వచ్చిన "బిచ్చగాడు" సినిమా తమిళంతో కంటే తెలుగులోనే ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం విశేషం. అప్పట్లో తెలుగులో థియేట్రికల్ హక్కుకు 2.50 కోట్లకు కొనుగోలు చేసిన బయ్యర్ కు దాదాపు తెలుగులోనే 26.5 కోట్లను అందించింది. ఇక తమిళంలో కేవలం 16 కోట్లను వసూలు చేసింది. మొదటి బిచ్చగాడు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా 42.5 కోట్లకు అందుకున్నాయి. కమర్షియల్ గా డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి.

ఫామ్ లోకి రావాలని..:విజయ్ ఆంటోని ఇప్పుడు బిచ్చగాడు 2 సినిమాను తనే స్వీయ దర్శకత్వంలో తెరపైకి తీసుకు వస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమాతో సక్సెస్ అందుకొని విజయ్ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. గత కొంతకాలంగా విజయ్ కు సరైన సక్సెస్ లేదు. మ్యూజిక్ డైరెక్టర్ గా బిజిగానే ఉన్నప్పటికీ నటుడిగా మాత్రం ఇంకా అతను మరో లెవెల్ కు చేరుకోవడం లేదు. ఇక ఈసారి తెలుగులో కూడా ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు.

100కు పైగా థియేటర్లలో రిలీజ్:బిచ్చగాడు సినిమాకు తెలుగులో కొంత పాజిటీవ్ హైప్ అయితే ఉంది. ఇక సినిమాకు దాదాపు 100కు పైగా థియేటర్లు దక్కినట్లు తెలుస్తోంది. పోటీగా కేవలం తెలుగులో అన్ని మంచి శకునములే అనే సినిమా మాత్రమే ఉంది. ఇక బిచ్చగాడు సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా మళ్ళీ థియేటర్ల సంఖ్యను పెంచుకునే అవకాశం అయితే ఉంది.

తెలుగు థియేట్రికల్ బిజినెస్:"బిచ్చగాడు 2" సినిమా ట్రైలర్ తోనే అభిమానులలో విపరీతమైన అంచనాలను పెంచింది. "బిచ్చగాడు 2" తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా తెలుగు బ్రేక్-ఈవెన్ టార్గెట్ 6.25 కోట్లకు ఫిక్స్ అయ్యింది. తప్పకుండా ఈసారి కూడా బిచ్చగాడు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని విజయ్ ఆంటోనీ నమ్మకంతో చెబుతున్నారు.

వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంత?:బిచ్చగాడు 2 సినిమా కోసం విజయ్ ఆంటోని తన శక్తి మేరకు ప్రమోషన్ అయితే చేస్తున్నాడు. ఇక తెలుగులో డీసెంట్ బిజినెస్ జరుగగా తమిళంలో కూడా అంచనాలు తగ్గట్టుగా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా టోటల్ 16 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక సినిమా సక్సెస్ కావాలి అంటే బాక్సాఫీస్ వద్ద మొత్తంగా 16.50 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాలి. మరి ఆ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











