Beast 12 Days Collections: విజయ్ సినిమాకు షాక్.. 5 రోజులకు కలిపి అంతే.. ఇంకెంత వస్తే హిట్ అంటే!

తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్‌గా వెలుగొందుతూ సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తున్నాడు ఇళయదళపతి విజయ్. విభిన్నమైన చిత్రాలు.. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. క్రమంగా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. అదే సమయంలో దక్షిణాది మొత్తం ఫాలోయింగ్‌ను పెంచుకుని మార్కెట్‌ను కూడా విస్తృత పరుచుకున్నాడు.

దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే విజయ్ 'బీస్ట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఫలితంగా కలెక్షన్లు సోసోగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బీస్ట్' 12 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

‘బీస్ట్' మోడ్‌తో వచ్చిన విజయ్

‘బీస్ట్' మోడ్‌తో వచ్చిన విజయ్

సౌతిండియన్ స్టార్ ఇళయదళపతి విజయ్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ తెరకెక్కించిన చిత్రమే ‘బీస్ట్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందించాడు. ఈ సినిమాలో సెల్వ రాఘవన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎంత

తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎంత

పేరుకు తమిళ హీరోనే అయినా విజయ్‌కు దక్షిణాది మొత్తంలో మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు ‘బీస్ట్' మూవీపై అంచనాలు అంతకంతకూ పెరిగాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ భారీ బిజినెస్ చేసుకుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 10 కోట్ల బిజినెస్ చేసుకుంది.

 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ‘బీస్ట్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, క్రమంగా ప్రేక్షకుల స్పందన తగ్గిపోతోంది. ఫలితంగా ఆరంభంలో భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత నిరాశనే ఎదుర్కొంటోంది. ఫలితంగా చివరి ఐదు రోజుల్లో రూ. 21 లక్షలే రాబట్టింది. అందులో ఆదివారం మాత్రమే రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం 4 లక్షలు షేర్ వచ్చింది.

12 రోజులకూ కలిపి వచ్చిందెంత

12 రోజులకూ కలిపి వచ్చిందెంత

తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లోనూ బీస్ట్ అంతగా రాణించలేదు. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 2.76 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 82 లక్షలు, ఈస్ట్‌లో రూ. 52 లక్షలు, వెస్ట్‌లో రూ. 40 లక్షలు, గుంటూరులో రూ. 59 లక్షలు, కృష్ణాలో రూ. 61 లక్షలు, నెల్లూరులో రూ. 39 లక్షలతో కలిపి.. మొత్తంగా రూ. 7.22 కోట్లు షేర్, రూ. 13 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత వస్తే

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత వస్తే

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘బీస్ట్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 10 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 12 రోజుల్లోనే రూ. 7.22 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 3.28 కోట్లు వస్తేనే ఈ మూవీ హిట్ అవుతుంది.

Recommended Video

KAKA TALKS: Frustrated Fans Over Beast Result నెల్సన్.. ది విలన్ | EP - 01 | Filmibeat Telugu
మిగిలిన ప్రాంతాల్లో కలెక్షన్లిలా

మిగిలిన ప్రాంతాల్లో కలెక్షన్లిలా

‘బీస్ట్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.22 కోట్లు వచ్చాయి. ఇక, ఈ సినిమాకు తమిళనాడులో రూ. 59.20 కోట్లు, కర్నాటకలో రూ. 6.35 కోట్లు, కేరళలో రూ. 4.95 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 31.65 కోట్లు వసూలు అయ్యాయి. ఫైనల్‌గా 12 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 111.07 కోట్లు షేర్, రూ. 218.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X