twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Beast 1st Week Collections: బీస్ట్‌కు దెబ్బ మీద దెబ్బ.. తెలుగులో ఊహించని విధంగా.. టోటల్‌గా మాత్రం!

    |

    దక్షిణాది మొత్తంలో మార్కెట్‌ను ఏర్పరచుకుని స్టార్లుగా వెలుగొందుతోన్న హీరోల్లో ఇళయదళపతి విజయ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచే విభిన్నమైన చిత్రాలు.. విలక్షణమైన సరళితో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. క్రమంగా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు.

    Recommended Video

    KAKA TALKS: Frustrated Fans Over Beast Result నెల్సన్.. ది విలన్ | EP - 01 | Filmibeat Telugu

    ఇక, గత ఏడాది 'మాస్టర్'తో భారీ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్న విజయ్.. ఇప్పుడు 'బీస్ట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు సోసోగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'బీస్ట్' వారం రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

    ‘బీస్ట్' మూవీతో వచ్చిన విజయ్

    ‘బీస్ట్' మూవీతో వచ్చిన విజయ్

    కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ తెరకెక్కించిన చిత్రమే ‘బీస్ట్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందించాడు. ఈ సినిమాలో సెల్వ రాఘవన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

    చరణ్ హీరోయిన్ ఎద అందాల ఆరబోత: బ్లౌజ్ ఉన్నా లేనట్లే మరీ ఘోరంగా!చరణ్ హీరోయిన్ ఎద అందాల ఆరబోత: బ్లౌజ్ ఉన్నా లేనట్లే మరీ ఘోరంగా!

    తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎంత

    తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎంత

    తమిళ హీరోనే అయినా విజయ్‌కు దక్షిణాది మొత్తంలో మంచి మార్కెట్ ఉంది. దీనికితోడు ‘బీస్ట్' మూవీపై అంచనాలు అంతకంతకూ పెరిగాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ భారీ బిజినెస్ చేసుకుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 10 కోట్ల వ్యాపారం జరుపుకుంది.

    7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

    7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

    ఇళయదళపతి విజయ్ నటించిన ‘బీస్ట్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, క్రమంగా ప్రేక్షకుల స్పందన తగ్గిపోతోంది. ఫలితంగా ఆరంభంలో భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం ఏడో రోజు మాత్రం రెండు రాష్ట్రాల్లో కలిపి కేవలం 3 లక్షలు షేర్ మాత్రమే రాబట్టింది. తమిళనాడు సహా వేరే ప్రాంతాల్లో సైతం దీనికి వసూళ్లు చాలా తగ్గిపోయాయనే చెప్పాలి.

    Samantha: సమంత బాడీపై చైతూ గుర్తు.. నెటిజన్ ఊహించని ప్రశ్న.. మీరు కూడా ఆ తప్పు చేయొద్దంటూ!Samantha: సమంత బాడీపై చైతూ గుర్తు.. నెటిజన్ ఊహించని ప్రశ్న.. మీరు కూడా ఆ తప్పు చేయొద్దంటూ!

    7 రోజులకూ కలిపి వచ్చిందెంత

    7 రోజులకూ కలిపి వచ్చిందెంత

    తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లోనూ బీస్ట్ సోసోగానే కలెక్షన్లను రాబట్టింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 2.69 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 79 లక్షలు, ఈస్ట్‌లో రూ. 50 లక్షలు, వెస్ట్‌లో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 57 లక్షలు, కృష్ణాలో రూ. 59 లక్షలు, నెల్లూరులో రూ. 38 లక్షలతో కలిపి.. మొత్తంగా రూ. 7.01 కోట్లు షేర్, రూ. 12.53 కోట్లు గ్రాస్ వచ్చింది.

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత వస్తే

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత వస్తే

    యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘బీస్ట్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 10 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారంలోనే రూ. 7.01 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 3.49 కోట్లు వస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్ అందుకుంటుంది.

    ప్రియుడితో ఏకాంతంగా నయనతార: ఒకే రూమ్‌లో క్లోజ్‌గా.. పర్సనల్ పిక్ బయటకు రావడంతో!ప్రియుడితో ఏకాంతంగా నయనతార: ఒకే రూమ్‌లో క్లోజ్‌గా.. పర్సనల్ పిక్ బయటకు రావడంతో!

    మిగిలిన ప్రాంతాల్లో కలెక్షన్లిలా

    మిగిలిన ప్రాంతాల్లో కలెక్షన్లిలా

    ‘బీస్ట్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ రూ. 7.01 కోట్లు వచ్చాయి. ఇక, ఈ సినిమాకు తమిళనాడులో రూ. 52.35 కోట్లు, కర్నాటకలో రూ. 6.19 కోట్లు, కేరళలో రూ. 4.70 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.62 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 28.15 కోట్లు వసూలు అయ్యాయి. ఫైనల్‌గా 7 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100.02 కోట్లు షేర్, రూ. 198.28 కోట్లు గ్రాస్ వచ్చింది.

    English summary
    Kollywood Star Hero Vijay Did Beast Movie Under Nelson Dilipkumar Direction. This Movie Collects Rs 100.02 Cr in 1st Week in Worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X