Beast 4 Days Collections: బీస్ట్ మూవీకి భారీ షాక్.. తెలుగులో ఊహించని విధంగా.. 4 రోజుల వసూళ్లు ఇలా!

పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని దక్షిణాది మొత్తంలో హవాను చూపిస్తున్నాడు ఇళయదళపతి విజయ్. కెరీర్ ఆరంభంలోనే మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న అతడు.. ఆ తర్వాత క్రమంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.

ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న విజయ్.. తాజాగా 'బీస్ట్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగులో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. మరి మూడు రోజుల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్ అవుతుంది? చూద్దాం పదండి!

బీస్ట్ మోడ్‌లో వచ్చేసిన విజయ్

బీస్ట్ మోడ్‌లో వచ్చేసిన విజయ్

నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన చిత్రమే 'బీస్ట్'. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ దీనికి సంగీతం అందించాడు. ఈ సినిమాలో సెల్వ రాఘవన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎంత

తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ ఎంత

ఇళయదళపతి విజయ్‌కు దక్షిణాది మొత్తంలో మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. దీనికితోడు 'బీస్ట్' మూవీపై అంచనాలు అంతకంతకూ పెరిగాయి. దీంతో ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ భారీ బిజినెస్ చేసుకుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 10 కోట్ల వ్యాపారం చేసుకుంది.

4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

4వ రోజూ విజయ్ 'బీస్ట్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ.7 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 1 లక్షలు, వెస్ట్‌లో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. మూడో రోజు రూ. 21 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వచ్చింది.

4 రోజులకూ కలిపి వచ్చిందెంత

4 రోజులకూ కలిపి వచ్చిందెంత

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనూ బీస్ట్ మంచి కలెక్షన్లనే రాబట్టింది. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 2.61 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 78 లక్షలు, ఈస్ట్‌లో రూ. 48 లక్షలు, వెస్ట్‌లో రూ. 38 లక్షలు, గుంటూరులో రూ. 55 లక్షలు, కృష్ణాలో రూ. 56 లక్షలు, నెల్లూరులో రూ. 37 లక్షలతో కలిపి.. మొత్తంగా రూ. 6.79 కోట్లు షేర్, రూ. 12.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత వస్తే

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత వస్తే

క్రేజీ కాంబినేషన్‌లో 'బీస్ట్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 10 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 10.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 6.79 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 3.71 కోట్లు వస్తేనే ఈ మూవీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

Recommended Video

KAKA TALKS: Frustrated Fans Over Beast Result నెల్సన్.. ది విలన్ | EP - 01 | Filmibeat Telugu
మిగిలిన ప్రాంతాల్లో కలెక్షన్లిలా

మిగిలిన ప్రాంతాల్లో కలెక్షన్లిలా

'బీస్ట్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ రూ. 6.79 కోట్లు వచ్చాయి. ఇక, ఈ సినిమాకు తమిళనాడులో రూ. 43.50 కోట్లు, కర్నాటకలో రూ. 5.95 కోట్లు, కేరళలో రూ. 4.40 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 21.50 కోట్లు వసూలు అయ్యాయి. ఫైనల్‌గా 4 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 83.66 కోట్లు షేర్, రూ. 164.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X