Beast: రేంజ్ కు తగ్గట్టుగానే షాక్ ఇస్తున్న విజయ్.. బీస్ట్ హక్కుల కోసం భారీ ఆఫర్స్.. అక్కడ నెంబర్ వన్..

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వందకోట్ల మార్కెట్ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. మిడియం రేంజ్ హీరోలు కూడా ఇటీవల కాలంలో చాలా ఈజీగా 150 కోట్ల వసూళ్లను అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. శివ కార్తికేయన్ లాంటి హీరోలు కూడా మెల్లగా వారి స్థాయిని పెంచుకుంటున్నారు. ఇక రజనీకాంత్ తర్వాత మాత్రం ఆయనకు మించి మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్న ఏకైక హీరో ఇళయదళపతి విజయ్ అనే చెప్పాలి. ఇప్పుడు మాత్రం కోలీవుడ్ లో కమర్షియల్ మార్కెట్ లో విజయ్ రజనీకాంత్ స్థాయికి మించి ఎదుగుతూ వస్తున్నాడు. మార్కెట్ పరంగా అతను కోలీవుడ్ ఇండస్ట్రీలో అయితే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా విడుదలకు సిద్ధమైన బీస్ట్ సినిమా ఓవర్సీస్ లో భారీ ధరకు అమ్ముడు పోయింది. ఆ వివరాల్లోకి వెళితే..

 తుపాకి సినిమా నుంచి

తుపాకి సినిమా నుంచి


స్టార్ హీరో విజయ్ ఇటీవల కాలంలో ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటున్నాయి. సినిమా సినిమాకు విజయ్ తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా తుపాకి సినిమా నుంచి అతనికి ఇతర ఇండస్ట్రీలో కూడా క్రేజ్ దక్కుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విజయ్ తన స్టార్ హోదాను పెంచుకుంటున్నాడు అనే చెప్పాలి.

మాస్టర్ తో తెలుగులో కూడా

మాస్టర్ తో తెలుగులో కూడా

విజయ్ నటించిన మాస్టర్ సినిమా తెలుగులో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అందులో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించడం కూడా ఒక విధంగా ప్లస్ అయింది. ఏదేమైనా విజయ్ మాత్రం తెలుగులో తన మార్కెట్ ను పది కోట్లకు పైగానే పెంచుకుంటూ వచ్చాడు. రానున్న రోజుల్లో అతని మార్కెట్ తెలుగులో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అర్థమవుతోంది.

 అందరి ఫోకస్ బీస్ట్ పైనే..

అందరి ఫోకస్ బీస్ట్ పైనే..

ఇక ప్రస్తుతం అయితే విజయ్ నటించిన బీస్ట్ సినిమా పైనే అందరి ఫోకస్ పడింది. ఈ సినిమాపై రోజురోజుకు అంచనాల స్థాయి పెరుగుతోంది. తప్పకుండా సౌత్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని కూడా సోషల్ మీడియాలో హడావుడి చూస్తేనే అర్థమవుతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరొక ముఖ్యమైన పాత్రలో తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ కూడా నటిస్తున్నాడు.

సాలీడ్ బిజినెస్

సాలీడ్ బిజినెస్

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే ఉండేటట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమిళం లో దాదాపు అన్ని ఏరియాలలో వంద కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 14వ తేదీన సినిమా విడుదల కాబోతోంది. ఇక మిగతా ఏరియాల్లో కూడా మెల్లగా బిజినెస్ డీల్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి. ఇక తెలుగులో కూడా మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఓవర్సీస్ రైట్స్..

ఓవర్సీస్ రైట్స్..


ఇక ఓవర్సీస్లో ఈ సినిమా అత్యధిక స్థాయిలో బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా రిలీజ్ హక్కులను ఓవర్సీస్ లో హంసిని ఎంటర్టైన్మెంట్స్ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం 38 కోట్లకు ఓవర్సీస్ హక్కులు అమ్ముడు అయినట్లుగా తెలుస్తోంది. తమిళ పరిశ్రమలోనే ఇది నెంబర్ వన్ ఓవర్సీస్ డీల్. విజయ్ మరోసారి తన స్టార్ హోదాను చాటుకుంటున్నాడు. మరి బీస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X