Beast Pre Release Bussiness: విడుదలకు ముందే ఊహించని టేబుల్ ప్రాఫిట్.. విజయ్ రేంజ్ అంటే ఇది!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమా ఈ నెల 13వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తెలుగులో కూడా ఈసారి విజయ్ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత? అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది? అనే వివరాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మొత్తంగా ఎంత బిజినెస్ చేసింది నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ ఎంత తెచ్చింది.. అనే వివరాల్లోకి వెళితే...

షాకింగ్ బడ్జెట్
ఇక ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ స్థాయిలోనే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు కళానిధి మారన్ దాదాపు 190 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించినట్లు తెలుస్తోంది. అసలైతే మొదట 150 కోట్ల లోనే సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా బడ్జెట్ పెరిగిపోయింది.

బిగ్గెస్ట్ కాంబినేషన్
దర్శకుడు నెల్సన్ ఇంతకుముందు కేవలం రెండు సినిమాలు మాత్రమే చేశాడు. ఇటీవల వచ్చిన డాక్టర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల కలెక్షన్స్ అందుకుంది. దీంతో అతనికి మంచి గుర్తింపును తేవడమే కాకుండా బీస్ట్ సినిమాకు కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. దీంతో విజయ్ నెల్సన్ కాంబినేషన్ కు మంచి డిమాండ్ ఏర్పడింది.

తమిళ్ బిజినెస్
190కొట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన బీస్ట్ సినిమా తమిళనాడులో 75 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. విజయ్ కెరీర్లోనే ఇది అత్యధిక బిజినెస్ తో విడుదలవుతోంది. తప్పకుండా ఈ సినిమా ఆ రికార్డును చాలా తొందరగానే బ్రేక్ చేస్తుంది అని కూడా తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు చెబుతున్నారు.

తెలుగులో ఎంతంటే..
ఇక తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడటంతో రిలీజ్ హక్కులను సొంతం చేసుకునేందుకు ప్రముఖ నిర్మాతలు పోటీ పడ్డారు. ఇక చివరికి దిల్ రాజు సురేష్ బాబు ఏషియన్ సినిమాస్ సునీల్ కలిసి ఈ సినిమా తెలుగు 10 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగులో ఆ టార్గెట్ ను ఈజీగా బ్రేక్ చేస్తుంది అని చెప్పవచ్చు.

మొత్తం థియేట్రికల్ బిజినెస్
ఇక కర్ణాటకలో ఈ సినిమా 7 కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. కేరళలో కూడా విజయ్ కు మార్కెట్ పెరుగుతుంది. అక్కడ ఈ సినిమా ఆరు కోట్లకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్ లో అయితే 24 కోట్లకు అమ్ముడు పోవడం విశేషం. థియేట్రికల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

నాన్ థియేట్రికల్ బిజినెస్
ఇక నాన్ థియేట్రికల్ గా కూడా ఈ సినిమా మంచి లాభాలను అందించింది. సన్ NXT ఈ సినిమా శాటిలైట్ హక్కులను 40 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక నార్త్ ఇండియాలో శాటిలైట్ డిజిటల్ హక్కుల రూపంలో 30కోట్లు లభించాయి. ఆడియో హక్కులు 4కోట్లకు అమ్ముడవ్వగా సౌత్ ఇండియా మొత్తం డిజిటల్ రైట్స్ రూపంలో 45కోట్లకు వరకు వచ్చాయి.

టేబుల్ ప్రాఫిట్స్..
190కోట్ల బడ్జెట్ తో రూపొందిన బీస్ట్ సినిమా టోటల్ గా 244కోట్ల బిజినెస్ చేసింది. ఇక టేబుల్ ప్రాఫిట్ గా సినిమాకు టోటల్ గా 54కోట్ల వరకు లాభాలు వచ్చాయి. సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు ఊహించని విధంగా ప్రాఫిట్స్ లభించాయి. విజయ్ రేంజ్ ఏమిటో ఈ లెక్కలతోనే చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











