Kushi movie Bussiness: లైగర్ డిజాస్టర్ అయినా అదే రేంజ్ లో విజయ్ దేవరకొండ మార్కెట్.. షాకింగ్ డీల్స్!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ సినిమాతో తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమా ప్రభావం విజయ్ దేవరకొండ తదుపరి సినిమాపై కూడా పడుతుందేమో అని కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ విజయ్ దేవరకొండ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు అని ఖుషి సినిమా బిజినెస్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ రికార్డు క్రియేట్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

లైగర్ ఎఫెక్ట్

లైగర్ ఎఫెక్ట్

విజయ్ దేవరకొండ వరుస విజయాలతో ఉన్నప్పుడే హిందీ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక అతను లైగర్ సినిమాతో ఎలాగైనా పాన్ ఇండియాలో అసలైన బాక్సాఫీస్ సక్సెస్ ను చూడాలని అనుకున్నాడు. ఆ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాడు. లైగర్ సినిమాకు చేస్తున్న సమయంలో ఇతర సినిమాల గురించి కూడా తన పెద్దగా ఆలోచించలేదు. అయితే లైగర్ సినిమా అందుకు భిన్నంగా బాక్సాఫీస్ వద్ద దారుణమైన నష్టాలను కలిగించింది.

 ఖుషి అందుకు భిన్నంగా

ఖుషి అందుకు భిన్నంగా

లైగర్ సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలలో పూరి కీలకంగా ఉండడంతో ఆయనే నష్టాలను భరించాలి అని కూడా పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఆందోళన చేయడం హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదాల వలన విజయ్ దేవరకొండ తదుపరి సినిమా మార్కెట్ పై ప్రభావం పడుతుందని కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ ఎంత మాత్రం నిజం కాదు అని ఇప్పుడు ఖుషి సినిమాకు వస్తున్న ఆఫర్స్ చూస్తేనే అర్థమవుతుంది.

 పవర్ఫుల్ కాంబినేషన్లో

పవర్ఫుల్ కాంబినేషన్లో

విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో విభిన్నంగా కనిపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు అతను వర్క్ చేస్తున్న ఖుషి సినిమా కూడా విభిన్నమైన క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తూ ఉండడం మరొక మేజర్ ప్లస్ పాయింట్. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న శివా నిర్వణ దర్శకత్వంలో వస్తుండడంతో సినిమాకు మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంది.

మ్యూజిక్ రైట్స్

మ్యూజిక్ రైట్స్

థియేట్రికల్ బిజినెస్ ఇంకా మొదలుపెట్టలేదు కానీ నాన్ థియేట్రికల్ గా అయితే ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఆడియో రైట్స్ కోసం కొన్ని ప్రముఖ మ్యూజిక్ సంస్థలు చాలా పోటీపడ్డాయి. అయితే రీసెంట్ గా సరిగమ మ్యూజిక్ కంపెనీ ఖుషి సినిమాకు సంబంధించిన మ్యూజిక్ రైట్స్ 14 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.

నాన్ థియేట్రికల్ బిజినెస్

నాన్ థియేట్రికల్ బిజినెస్

అయితే సినిమాకు సంబంధించిన అన్ని భాషలకు సంబంధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు 90 కోట్లకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిందీ డిజిటల్ రైట్స్ శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్మగా.. మరికొన్ని భాషలకు సంబంధించిన డీల్స్ కూడా మరి కొన్ని రోజుల్లో క్లోజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ కూడా విజయ్ దేవరకొండ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X