twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Liger 1st week Collections: పండగరోజు కూడా పెరగని కలెక్షన్స్.. బిగ్గెస్ట్ డిజాస్టర్ దిశగా లైగర్!

    |

    టాలీవుడ్ రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న విజయ దేవరకొండ లైగర్ సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్లో అడుగు పెట్టాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తప్పకుండా ఎంతో కొంత సక్సెస్ అవుతుంది అని అనుకున్నారు. కానీ నెగటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. వినాయక చవితి పండుగ రోజు కూడా ఈ సినిమా కొంతైనా నష్టాలు తగ్గిస్తుంది అనుకుంటే ఏమాత్రం కలెక్షన్స్ రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక మొత్తంగా ఫస్ట్ వీక్ లో సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఏ స్థాయిలో నష్టాలను కలిగించబోతోంది అనే వివరాల్లోకి వెళితే...

    ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రీ రిలీజ్ బిజినెస్

    లైగర్ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఆంధ్ర, తెలంగాణలో దాదాపు దీనికి రూ. 62 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కర్నాటకలో రూ. 5.20 కోట్లు, తమిళనాడులో రూ. 2.50 కోట్లు, కేరళలో రూ. 1.20 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 88.40 కోట్లు మేర బిజినెస్ చేసింది.

    7వ రోజు తెలుగు స్టేట్స్ కలెక్షన్స్

    7వ రోజు తెలుగు స్టేట్స్ కలెక్షన్స్

    'లైగర్' మూవీ ఆంధ్ర తెలంగాణలో 7వ రోజు వసూళ్లు మరింత దారుణంగా తగ్గాయి. మొదటిరోజు 9.57 కోట్లు అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత 2వ రోజు కేవలం 1.54 కోట్లు మాత్రమే సొంతం చేసుకుంది. ఇక 3వ రోజు కోటి రూపాయల షేర్, 4వ రోజు 58 లక్షల షేర్ రాగా 5వ రోజు 12 లక్షలు, 6వ రోజు 6 లక్షలు, 7వ రోజు 8 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

     ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్

    ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్

    7 రోజుల్లో 'లైగర్' సినిమా తెలుగు స్టేట్స్ లో ఊహించని విధంగా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. టోటల్ ఏరియాల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 5.69 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.85 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.75 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 88 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 55 లక్షలు కోట్లు, గుంటూరులో రూ. 1.01 కోట్లు, కృష్ణాలో రూ. 69 లక్షలు, నెల్లూరులో రూ. 54 లక్షలతో.. మొత్తం 7 రోజుల్లో రూ. 12.95 కోట్లు షేర్, రూ. 21.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

    ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్

    'లైగర్' సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో రూ. 12.95 కోట్లు షేర్ అందుకోగా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.52 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.38 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 7.70 కోట్లు, మిగిలిన భాషల్లో రూ. 82 లక్షల షేర్ వచ్చింది. మొత్తంగా 7 రోజుల్లో లైగర్ సినిమా వరల్డ్ వైడ్ రూ. 26.37 కోట్లు షేర్‌, రూ. 55.50 కోట్లు గ్రాస్ అందుకుంది.

    భారీ స్థాయిలో నష్టాలు

    భారీ స్థాయిలో నష్టాలు

    'లైగర్' సినిమా వినాయకచవితి సందర్భంగా అయినా కొంత వసూళ్ళను పెంచుకుందేమో అనుకుంటే అది కూడా వర్కౌట్ కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా రూ. 88.40 కోట్లు మేర బిజినెస్ చేసిన లైగర్ రూ. 90 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా విడుదలయ్యింది. ఇక 7 రోజుల్లో ఈ సినిమాకు రూ. 26.37 కోట్లు వచ్చాయి. ఇక నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఇంకా 68.86 కోట్లు రావాలి. కానీ సినిమా బుధవారం నాటికి మరింత తక్కువ స్థాయిలో కలెక్షన్స్ రావడంతో భారీ నష్టాలు చూసే అవకాశం ఉంది.

    డిజాస్టర్ రికార్డ్

    డిజాస్టర్ రికార్డ్


    లైగర్ కంటే మూడు వారాల ముందు వచ్చిన సినిమాలు పండగ రోజు మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. లైగర్ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యదిక స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. దీంతో ఈ ఎడాది ఆచార్య అనంతరం అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. టోటల్ గా సినిమా 30 కోట్ల షేర్ అందుకోవడక్ కూడా కష్టమే అనిపిస్తోంది.

    English summary
    Vijay Devarakonda Did Liger Movie Under Puri Jagannadh Direction. This Movie Collect Rs 24.41 Cr in 4 Days World Wide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X