Liger OTT: పుష్ప కంటే ఎక్కువగా లైగర్ బిజినెస్.. భారీ ధరకు అమ్ముడైన ఓటీటీ హక్కులు

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తున్న సినిమాలలో లైగర్ సినిమా టాప్ లిస్టులో ఉంది అని చెప్పాలి. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ టాక్ అయితే కొనసాగుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. పుష్ప సినిమా కంటే ఎక్కువ స్థాయిలో లైగర్ సినిమా ఓటీటీ హక్కులను అమ్ముడయినట్లు తెలుస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే...

పవర్ఫుల్ గా..

పవర్ఫుల్ గా..


ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంతగానో కష్టపడే స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విజయ్ దేవరకొండ దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ప్రతీ సినిమాకు కూడా ఎంతో కొంత డిఫరెంట్ గా ఉండేలా అడుగులు వేస్తున్న ఈ టాలెంటెడ్ హీరో ప్రస్తుతం లైగర్ సినిమాతో మరింత పవర్ఫుల్ గా సిద్ధమవుతున్నాడు.

భారీ బడ్జెట్ తోనే..

భారీ బడ్జెట్ తోనే..


ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన వెంటనే విజయ్ దేవరకొండ తో సినిమాను మొదలు పెట్టేసాడు. అన్ని వర్గాల ప్రేక్షకులలో కూడా ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగి పోతూనే ఉన్నాయి. అయితే ఈ సినిమాను పూరి జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు 150 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెర పైకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం.

సక్సెస్ ఫార్ములా..

సక్సెస్ ఫార్ములా..

లైగర్ సినిమా పై మొదటి నుంచి కూడా ప్రేక్షకుల్లో ఒక పాజిటివ్ టాక్ కొనసాగుతోంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా.. అంతేకాకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా సక్సెస్ ఫార్ములాతో సినిమా తీస్తున్నాడు. ఆయన గతంలో బాక్సింగ్ నేపథ్యంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ ఒక ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు.

రిలీజ్ డేట్ ఫిక్స్..

రిలీజ్ డేట్ ఫిక్స్..

గత ఏడాది నుంచి లైగర్ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. అసలైతే గత ఏడాది డిసెంబర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది.
కాని కరోనా కారణంగా మిగతా సినిమాల మాదిరిగానే వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా ఆగస్టు 25న సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

పుష్ప కంటే ఎక్కువగా..

పుష్ప కంటే ఎక్కువగా..


ఇక ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేసుకున్నప్పటికీ నుంచి కూడా భారీ స్థాయిలో ఆఫర్స్ అయితే వస్తున్నాయి. కేవలం థియేట్రికల్ గానే కాకుండా నాన్ థియేట్రికల్ గా కూడా సినిమా ఎవరూ ఊహించని స్థాయిలో బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమా ఓటీటీ ద్వారా 30 కోట్లకు పైగా లాభాలను అందించగా లైగర్ సినిమా అంతకంటే ఎక్కువ స్థాయిలో లాభాలను అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Recommended Video

Vijay Deverakonda’s AVD Cinemas To Be Launched With Love Story
అమెజాన్ ప్రైమ్.. ఎంతకు కొన్నారంటే?

అమెజాన్ ప్రైమ్.. ఎంతకు కొన్నారంటే?


ఇక రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లైగర్ సినిమా అన్ని భాషలు హక్కులను కూడా ఆమెజాన్ ప్రైమ్ 60 కోట్లకు పైగా ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు సమాచారం.
కేవలం ఓటీటీ ద్వారానే సినిమా ఈ స్థాయిలో ఆఫర్ ను అందుకుంది అంటే ఇంకా శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా ఏ స్థాయిలో లాభాలు అందుకుంటుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 25న సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X