For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  LIGER Day 1 Collections: నెగెటివ్ టాక్‌తోనూ లైగర్ సంచలనం.. ఏకంగా అన్ని కోట్లతో విజయ్ రికార్డు

  |

  హీరోగా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. ఫస్ట్ మూవీతోనే బిగ్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న అతడు.. ఆ వెంటనే పలు భారీ విజయాలను అందుకున్నాడు. ఫలితంగా ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక సతమతం అవుతోన్న విజయ్.. ఇప్పుడు 'లైగర్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రానికి టాక్‌ వచ్చినా కలెక్షన్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో 'లైగర్' మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

  లైగర్‌గా ఎంట్రీ ఇచ్చిన విజయ్

  లైగర్‌గా ఎంట్రీ ఇచ్చిన విజయ్

  టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రమే 'లైగర్'. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ మూవీని ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేశారు.

  Liger: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు అషు రెడ్డి షాక్.. ఆ పని మాత్రం చేయకండి అంటూ!

  లైగర్ మూవీ బిజినెస్ వివరాలు

  లైగర్ మూవీ బిజినెస్ వివరాలు

  పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన 'లైగర్' మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీంతో ఆంధ్ర, తెలంగాణలో కలిపి దీనికి రూ. 62 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటకలో రూ. 5.20 కోట్లు, తమిళనాడులో రూ. 2.50 కోట్లు, కేరళలో రూ. 1.20 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 88.40 కోట్ల బిజినెస్ జరిగింది.

  నెగెటివ్ టాక్.. వసూళ్లు మాత్రం

  నెగెటివ్ టాక్.. వసూళ్లు మాత్రం

  భారీ అంచనాల నడుమ రూపొందిన 'లైగర్' మూవీ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ నెగెటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డేన కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.

  దారుణమైన ఫొటోతో షాకిచ్చిన దిశా పటానీ: ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

  తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

  తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది

  'లైగర్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రెస్పాన్స్ బాగా వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 4.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.32 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.27 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 64 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 83 లక్షలు, కృష్ణాలో రూ. 48 లక్షలు, నెల్లూరులో రూ. 40 లక్షలతో.. రూ. 9.57 కోట్లు షేర్, రూ. 15.40 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

  ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

  ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా

  'లైగర్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 9.57 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 55 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.56 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 55 లక్షలు, మిగిలిన భాషల్లో రూ. 22 లక్షలు వసూలైంది. వీటితో కలిపి మొదటి రోజు దీనికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.45 కోట్లు షేర్‌, రూ. 24.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

  ఘోరమైన ఫొటోలు వదిలిన హీరోయిన్: ఏం చూపించకూడదో అవే చూపిస్తూ!

  టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?

  టార్గెట్ ఇలా.. ఇంకెంత రావాలి?


  క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88.40 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 90 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 13.45 కోట్లు వచ్చాయి. అంటే మరో 76.55 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

  టాలీవుడ్‌లో టాప్ మూవీగా రికార్డ్

  టాలీవుడ్‌లో టాప్ మూవీగా రికార్డ్


  విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లైగర్' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు వచ్చాయి. మొదటి రోజు దీనికి ఏకంగా రూ. 9.57 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో టైర్ 2 హీరోల జాబితాలో ఈ చిత్రం టాప్ ప్లేస్‌కు చేరింది. తద్వారా 'ఇస్మార్ట్ శంకర్' పేరిట ఉన్న రూ. 7.73 కోట్ల రికార్డును లైగర్ బ్రేక్ చేసింది.

  English summary
  Vijay Devarakonda Did Liger Movie Under Puri Jagannadh Direction. This Movie Collect Rs 13.45 Cr in First Day.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X