Liger Movie Pre Release Bussiness: విజయ్ దేవరకొండ కెరీర్ లోనే రికార్డ్ బిజినెస్.. టార్గెట్ ఎంతంటే?
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కలయికలో రాబోతున్న లైగర్ పై రోజురోజుకు అంచనాలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమాపై నార్త్ లో కూడా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసుకుంటోంది. చిత్ర యూనిట్ సభ్యులు ఎక్కడికి వెళ్లినా కూడా జనాల నుంచి రెస్పాన్స్ ఒక రేంజ్ లోనే కొనసాగుతోంది. అయితే లైగర్ సినిమాకు సంబంధించిన బిజినెస్ లెక్కలు కూడా బయటికి వచ్చాయి. ఇక లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత బిజినెస్ చేసింది? అలాగే ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

కెరీర్ బిగ్గెస్ట్ రిలీజ్
విజయ్ దేవరకొండకు అలాగే పూరి జగన్నాథ్ కు కూడా ఈ సినిమా చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనివిధంగా వీరు ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ చేశారు అనే చెప్పాలి. 2019లో స్టార్ట్ అయిన ఈ సినిమా అనేక రాక ఒడిదుడుకులను దాటి మొత్తానికి ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే కాకుండా పూరి జగన్నాథ్ కెరీర్ లో కూడా ఈ సినిమా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది.

భారీ డిమాండ్
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది అనే వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే లైగర్ సినిమా అత్యధిక బిజినెస్ చేయడం విశేషం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మంచి బిజినెస్ అయితే చేసింది. మొదటి నుంచి కూడా లైగర్ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడంతో పోటీపడి రిలీజ్ హక్కులను దక్కించుకున్నారు. తప్పకుండా సినిమా మొదటి రోజు ఉహాలకందని రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని కూడా అనుకుంటున్నారు.

ఆంధ్ర, తెలంగాణ బిజినెస్..
నైజాం ఏరియాలో విజయ్ దేవరకొండకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని ప్రతి సినిమాకు కూడా నైజంలో అత్యధిక కలెక్షన్స్ అందుకుంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆ ఏరియాలో ఏకంగా 25 కోట్ల బిజినెస్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక సీడెడ్ లో అయితే విజయ్ దేవరకొండ సినిమా మొదటిసారి 9 కోట్ల ధర పలికింది. ఇక ఆంధ్ర మొత్తంలో చూసుకుంటే 28 కోట్ల వరకు ప్రీతి బిజినెస్ చేయక మొత్తంగా ఏపీ తెలంగాణలో లైగర్ సినిమా 62 కోట్ల బిజినెస్ చేసింది.

మిగతా రాష్ట్రాల్లో..
ఇక కర్ణాటకలో కూడా ఈ సినిమాకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఇదివరకే అక్కడ పూరి జగన్నాథ్ సినిమాలు రికార్డు వసూళ్ళను అందుకున్నాయి. ఇక ఇప్పుడు లైగర్ సినిమా కూడా అక్కడ మంచి హైప్ అయితే క్రియేట్ చేసుకుంది. దీంతో 5.20 కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం. ఇక తమిళంలో అయితే 2.5 కోట్లు కేరళలో 1.20 కోట్ల ధర పలికినట్లుగా తెలుస్తోంది.

వరల్డ్ వైడ్ బిజినెస్
ఇక ప్రతిసారి ఓవర్సీస్ లో కూడా విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు లైగర్ సినిమా ఓవర్సీస్ లో 7.5 కోట్ల వరకు బిజినెస్ చేసింది. నార్త్ ఇండియా లో అయితే 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే లైగర్ సినిమా 88.40 కోట్ల బిజినెస్ అయితే.

టార్గెట్ ఫిక్స్
బిజినెస్ ను బట్టి బాక్స్ ఆఫీస్ వద్ద 90 కోట్లు టార్గెట్ అయితే సెట్ అయింది. ఇక ఈ టార్గెట్ ను మాత్రం విజయ్ దేవరకొండ చాలా ఈజీగా బ్రేక్ చేస్తాడు అని అనిపిస్తోంది. ఎందుకంటే బుక్ మై షో లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక టికెట్లు అయితే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. చాలా సెంటర్లలో కొన్ని నిమిషాలకే టికెట్లు అన్నీ సేల్ అవ్వడం విశేషం. దాదాపు అన్ని ఏరియాల్లో కూడా మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ పాత రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











