For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Liger: రిలీజ్‌కు ముందే లైగర్ సెన్సేషనల్ రికార్డు.. పవన్, బన్నీని దాటిన విజయ్ దేవరకొండ

  |

  చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ కెరీర్‌ను మొదలు పెట్టి.. 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న అతడు.. ఆ తర్వాత మరిన్ని సక్సెస్‌లతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో అతడు ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న విజయ్.. ఇప్పుడు 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీతో రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్టార్ హీరో అదిరిపోయే రికార్డును అందుకున్నాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

  లైగర్‌గా మారిపోయిన విజయ్

  లైగర్‌గా మారిపోయిన విజయ్

  టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రమే 'లైగర్'. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ మూవీని ఛార్మీ, పూరీతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేశారు.

  అతడితో పెళ్లికి ముందు హన్సిక ఘాటుగా! నాటుగా అందాల ఆరబోత

  భారీ అంచనాలతో విడుదల

  భారీ అంచనాలతో విడుదల


  'లైగర్' మూవీపై ఆరంభం నుంచే ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు సైతం క్రియేట్ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు.

  విజయ్ కెరీర్‌లో టాప్ మూవీ

  విజయ్ కెరీర్‌లో టాప్ మూవీ

  విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' మూవీ అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 62 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 88.40 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇది విజయ్ కెరీర్‌లోనే టాప్ బిజినెస్ కావడం విశేషం.

  యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన: ఏకంగా అలాంటి ఫోజులతో ఘోరంగా!

  లైగర్ థియేటర్ల వివరాలివే

  లైగర్ థియేటర్ల వివరాలివే

  భారీగా రాబోతున్న 'లైగర్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలోనే విడుదల కాబోతుంది. తాజా సమాచారం ప్రకారం.. నైజాంలో 320, సీడెడ్‌లో 190 థియేటర్లలో రాబోతుంది. అలాగే, ఆంధ్రాలోని అన్ని ప్రాంతాల్లో కలిపి 420 థియేటర్లలో ప్రదర్శితం అవబోతుంది. అంటే.. ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమా 930కి పైగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

   మిగిలిన భాషల్లో లెక్కలిలా

  మిగిలిన భాషల్లో లెక్కలిలా

  'లైగర్' మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక, దీన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 930 థియేటర్లలో, తమిళనాడులో 100, కర్నాటకలో 100, కేరళలో 100, హిందీ ప్లస్ రెస్టాప్ ఇండియాలో 1000, ఓవర్సీస్‌లో 700 థియేటర్లలో తీసుకు వస్తున్నారు. మొత్తంగా 3000 థియేటర్లలో రాబోతుంది.

  ఉల్లిపొర లాంటి చీరలో మంజూష రచ్చ: ఆ అందాలన్నీ చూపిస్తూ హాట్ షో

  విజయ్ 1, ఓవరాల్‌గా 7కు

  విజయ్ 1, ఓవరాల్‌గా 7కు

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'లైగర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా 3000లకు పైగా థియేటర్లలో విడుదల కాబోతుంది. దీంతో విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యధిక థియేటర్లలో విడుదల అవుతోన్న చిత్రంగా ఇది రికార్డు క్రియేట్ చేసింది. అదే సమయంలో ఎక్కువ థియేటర్లలో రాబోతున్న తెలుగు చిత్రాల జాబితాలో 'లైగర్' ఏకంగా ఏడో స్థానానికి చేరుకుని సత్తా చాటబోతుంది.

  బన్నీ, పవన్‌ను దాటేశాడు

  బన్నీ, పవన్‌ను దాటేశాడు

  'లైగర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా 3000లకు పైగా థియేటర్లలో విడుదల కాబోతుందని ముందు చెప్పుకున్నాం. దీంతో అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' (3000 థియేటర్లు), పవన్ కల్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' (2800 థియేటర్లు) రికార్డులను ఈ సినిమా దాటేసింది. దీంతో విజయ్ చిత్రానికి మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల టాక్.

  English summary
  Vijay Devarakonda Did Liger Movie Under Puri Jagannadh Direction. Lets Know about This Movie World Wide Total Theaters Count.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X