1000 కోట్ల కల్కి.. వావ్.. ఫలించిన విజయ్ దేవరకొండ జోస్యం.. రౌడీ స్టార్ పోస్టు వైరల్
చాలా కాలం తర్వాత తెలుగు సినిమా నుంచి వచ్చిన ఓ భారీ చిత్రం పాన్ ఇండియా సినిమాను రూల్ చేస్తుంది. మరి ఇండియన్ సినిమా తాలూకా గతిని మార్చింది మన తెలుగు సినిమానే కాగా ఇపుడు ఆ పరంపర కొనసాగుతు వెళ్లడమే కాకుండా ఇతర ఇండస్ట్రీలలో కూడా పలు భారీ చిత్రాలకి భరోసా ఇచ్చింది మన సినిమానే. మరి ఇలా మన తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకునే దిశగా దూసుకెళ్తుంది.
అయితే ఈ ఏడాది ఆరంభంలో హను మాన్ అనే సినిమా పాన్ ఇండియా భాషల్లో దుమ్ము లేపితే మళ్ళీ ఆ సినిమా తర్వాత మరో సాలిడ్ సినిమా తెలుగు నుంచి రాలేదు. అలా కొన్ని వాయిదాలు తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ చిత్రమే "కల్కి 2898 ఎడి". పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ హీరోగా దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి వారితో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా 1000 కోట్ల వసూళ్లతో మరోసారి తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పింది.

మరి ఈ చిత్రం అందుకున్న ఈ 1000 కోట్ల మార్క్ చాలా కాలం నుంచి తెలుగు సినిమాకి దూరంగా ఉండగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత మళ్ళీ ప్రభాస్ తో సాధ్యం అయ్యింది. అయితే గడిచిన ఈ రెండేళ్లలో 1000 కోట్ల మార్క్ అనేది చాలా సింపుల్ అన్నట్టు కనిపించింది కానీ ఇదేమి అంత సింపుల్ కాదు. ఓపెనింగ్స్ ఉంచి సినిమా కంటిన్యూస్ రన్ పై ఆధారపడి ఉంటుంది.
మరి ఈ సినిమా అలా వచ్చి ఖచ్చితంగా 1000 కోట్లు సాధిస్తుంది అని నమ్మిన యంగ్ హీరో కల్కి సినిమాలో అర్జునుడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా చూసిన తర్వాత విజయ్ చేసిన పాత పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. "ఇప్పుడే సినిమా చూసాను మాటలు లేవు, ఇండియన్ సినిమా దగ్గర కొత్త అధ్యాయంకి తాళం తీర్చుకుంది. ఈ సినిమా 1000 కోట్లు సాధిస్తుంది అని ఆశిస్తున్నాను" అని పోస్ట్ చేసాడు.

ఇప్పుడు సీన్ కట్ చేస్తే నిజంగానే ఈ భారీ చిత్రం ఆ మాసివ్ మార్క్ ని అందుకొని చరిత్ర తిరగరాసింది. దీనితో కల్కి మన తెలుగు నుంచి మూడో 1000 కోట్ల గ్రాసర్ గా నిలవగా ఇండియన్ సినిమా నుంచి బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్, దంగల్, జవాన్, పఠాన్ సినిమాల తర్వాత నిలిచింది. మరి పూర్తి రన్ లో కల్కి ఎంతవరకు వసూళ్లు రాబడుతుంది అని అందరిలో ఆసక్తి నెలకొంది.

కాగా ఈ భారీ ప్రాజెక్ట్ లో విజయ్ దేవరకొండ సహా, యువ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లు క్యామియో రోల్స్ లో నటించగా దీపికా పదుకొనె, దిశా పటానిలు లీడింగ్ లేడీస్ గా కనిపించారు. అలాగే కీర్తి సురేష్ బుజ్జికి డబ్బింగ్ చెప్పింది. ఇంకా వీరితో పాటుగా దిగ్గజ దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మలు కూడా ఇంట్రెస్టింగ్ క్యామియోస్ లో నటించగా వైజయంతి మూవీస్ నిర్మాణం వహించారు. త్వరలోనే సీక్వెల్ ని పట్టాలెక్కించనున్నారు.


Click it and Unblock the Notifications











