Don't Miss!
- Sports
వీడియో: క్షణం..క్షణం టెన్షన్‌తో: ఢిల్లీ కేపిటల్స్ ఓటమితో పండగ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్
- News
పెండింగ్‌లో ఏపీసీసీ చీఫ్ పదవి..!! కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యతిరేకత?
- Finance
Gold Prices Today: భారీగా తగ్గి, పెరిగిన బంగారం ధరలు
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Automobiles
పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయ్ దేవరకొండకు భారీ ఆఫర్.. ఆ ప్రాజెక్ట్ కోసం ఊహించని విధంగా ఆదాయం..
రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ చూస్తుండగానే అతి వేగంగా పాన్ ఇండియా రూట్లో ఒక మార్కెట్ ను క్రియేట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా లైగర్ సినిమాపైనే ఉంది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ భారీ స్థాయిలో పారితోషికం తీసుకున్నట్లు కూడా టాక్ వస్తోంది. ఇక రాబోయే సుకుమార్ సినిమా కోసం కూడా భారీ ఆఫర్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

చాలా గ్యాప్ వచ్చింది..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమా చేసినా కూడా మొదటి నుంచి విభిన్నమైన తరహాలో అందరికీ నచ్చే విధంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఈ రౌడీ స్టార్ ని వెండి తెరపై చూసి చాలా కాలమైంది. కరోనా కారణంగా ఆలస్యమైనప్పటికీ కూడా రాబోయే లైగర్ సినిమాతో మాత్రం బాక్సాఫీసు వద్ద పెను సంచలనం సృష్టిస్తాడు అని ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో నే ఒక క్లారిటీ వచ్చేసింది.

లైగర్.. ఎంతవరకు వచ్చిందంటే?
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా మొదటి సారి ఒక ప్రాజెక్టు కోసం చాలా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుండడం విశేషం. అంతే కాకుండా లైగర్ సినిమాకోసం బడ్జెట్ కూడా చాలా ఎక్కువే. దాదాపు 150 కోట్ల వరకు ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తయింది. మరో కీలకమైన షెడ్యూల్ ఫినిష్ చేస్తే షూటింగ్ మొత్తం కూడా ఫినిష్ అవుతుందట. ఆగస్టు లోనే సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

ముందుగానే ప్లాన్..
పూరి జగన్నాథ్ తో పాటు ఈ సినిమాను కరణ్ జోహార్ కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎలాగైనా బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో విడుదల చేయాలి అని విజయ్ దేవరకొండ ముందుగా ప్రణాళిక రచించాడు. ఆ తరువాతనే లైగర్ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. తప్పకుండా లైగర్ సినిమా బాలీవుడ్ లో కూడా ఒక సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది అని అందరిలో ఒక గట్టి నమ్మకం అయితే ఉంది.

20కోట్లకు పైగా..
అయితే లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ గతంలో ఎప్పుడూ లేనివిధంగా అత్యధిక పారితోషికం అందుకోబోతున్నారు అని ఇప్పటి వరకు చాలా రకాల కథనాలు వచ్చాయి. కానీ విజయ్ ఆ సినిమాకు లాభాల్లో వాటా తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. విజయ్ కు లైగర్ ద్వారా దాదాపు 20 కోట్లకు పైగానే లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

సుకుమార్ సినిమాకు అంతకుమించి..
సుకుమార్ దర్శకత్వంలో కూడా విజయ్ దేవరకొండ ఒక సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు రాంపేజ్ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు గా కథనాలు అయితే గట్టిగానే వస్తున్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ కూడా అదే తరహాలో ఒక హింట్ అయితే ఇచ్చాడు.
ఇక లైగర్ సినిమా విజయం తరువాత సుకుమార్ సినిమా కోసం విజయ్ దేవరకొండ అంతకుమించి అనే ఆదాయం అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఒకేసారి 40 కోట్లు కూడా దాటవచ్చని తెలుస్తోంది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించే అవకాశం ఉందట. మరి సుకుమార్ విజయ్ దేవరకొండతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.