FAMILY STAR 2 Days Collections: ఒక్కసారిగా డౌన్.. 2 రోజుల్లో అన్ని కోట్లే.. విజయ్ హిట్ కొట్టాలంటే
ప్రత్యేకమైన యాక్టింగ్ స్కిల్, విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. దీనికితోడు ఎన్నో హిట్లు కొట్టిన అతడు.. ఈ మధ్య నిరాశనే ఎదుర్కొంటున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో 'ఫ్యామిలీ స్టార్' మూవీ చేశాడు. దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా ఆశించినట్లుగా దక్కడం లేదు. ఫలితంగా ఈ చిత్రం రెండో రోజు డౌన్ అయిపోయింది. మరి 'ఫ్యామిలీ స్టార్' మూవీ 2 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!
ఫ్యామిలీ స్టార్‌గా విజయ్ రాక
విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రమే 'ఫ్యామిలీ స్టార్'. పరశురాం పెట్ల రూపొందించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషించారు.

ఫ్యామిలీ స్టార్ బిజినెస్ ఇలా
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీకి నైజాంలో రూ. 13.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 17.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 34.50 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.50 కోట్లతో కలిపి దీనికి రూ. 43 కోట్లు బిజినెస్ జరిగింది.
2వ రోజు డౌన్.. మొత్తంగా
పరశురాం పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీకి రెండో రోజు రెస్పాన్స్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.10 కోట్లు షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్‌గా రూ. 2.80 కోట్లు వసూలు అయింది. ఇలా ఈ చిత్రం రెండు రోజుల్లో తక్కువ వసూళ్లనే రాబట్టి షాకిచ్చింది.



Click it and Unblock the Notifications











