FAMILY STAR Day 1 Collections: విజయ్‌కు బిగ్ షాక్.. తొలి రోజు ఊహించని విధంగా.. మూవీ హిట్ కొట్టాలంటే!
డిఫరెంట్ యాక్టింగ్ స్టైల్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలోనే ఎనలేని గుర్తింపును, క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. దీనికితోడు ఆరంభంలోనే ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో అంతగా రాణించడం లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో 'ఫ్యామిలీ స్టార్' మూవీ చేశాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ వచ్చింది. ఫలితంగా తొలి రోజు కలెక్షన్లు మైండ్ బ్లాక్ అయ్యేలా లభించాయి. మరి 'ఫ్యామిలీ స్టార్' మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల రిపోర్టును మీరే చూసేయండి!
ఫ్యామిలీ స్టార్‌గా వచ్చేశాడు
విజయ్ దేవరకొండ - పరశురాం కలయికలో వచ్చిన మరో చిత్రమే 'ఫ్యామిలీ స్టార్'. ఫ్యామిలీ స్టోరీతో వచ్చిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేశారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఫ్యామిలీ స్టార్ బిజినెస్ ఇలా
విజయ్ నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీకి నైజాంలో రూ. 13.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 17.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 34.50 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.50 కోట్లతో కలిపి దీనికి రూ. 43 కోట్లు బిజినెస్ అయింది.
డీసెంట్ టాక్‌తో రెస్పాన్స్
క్రేజీ ఫ్యామిలీ స్టోరీతో రూపొందిన 'ఫ్యామిలీ స్టార్' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే అంటే మోస్తరుగానే లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలోనే వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

తొలి రోజు ఎంత వచ్చింది?
'ఫ్యామిలీ స్టార్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే తక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 46 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 46 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 26 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో కలిపి.. రూ. 3.85 కోట్లు షేర్, రూ. 6.15 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 3.85 కోట్లు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 40 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2.05 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 6.30 కోట్లు షేర్‌తో పాటు రూ. 11.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 43 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 44 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 6.30 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 37.70 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











