FAMILY STAR Business: విజయ్ మూవీకి షాకింగ్ బిజినెస్.. వాటి కంటే తక్కువగానే.. హిట్ టార్గెట్ ఎంతంటే!
టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. ఇలా ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను కూడా భారీగా పెంచుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలన్న కసితో ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను మీరే చూసేయండి!
ఫ్యామిలీ స్టార్‌గా విజయ్ రెడీ
క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ సినిమానే 'ఫ్యామిలీ స్టార్'. పరశురాం తెరకెక్కించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేశారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేశారు.

అలాంటి కథతో.. భారీగానే
డబ్బు పొదుపు చేసుకునే ఒక కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత తన అలవాట్ల వల్ల ఇబ్బందులను ఎదుర్కోవడం అనే అంశాలతో తెరకెక్కిన సినిమానే 'ఫ్యామిలీ స్టార్'. ఇందులో విజయ్ దేవరకొండ.. మృణాల్ ఠాకూర్ భార్యభర్తలుగా నటించారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తీశారు.
ప్రమోషన్స్‌తో సందడిగానే
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'ఫ్యామిలీ స్టార్' మూవీని ఏప్రిల్ 5వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక, ఎప్పటి నుంచో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సందడి కనిపిస్తోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు విశ్వక్ సేన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే బుకింగ్స్ విషయంలో కూడా ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది.

సినిమా ప్రీ బిజినెస్ ఇలా
ఫ్యామిలీ స్టోరీతో రూపొందిన 'ఫ్యామిలీ స్టార్' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో దీనికి అన్ని ఏరియాల్లో మంచి డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా నైజాంలో రూ. 13.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 17.00 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 34.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది.
వరల్డ్ వైడ్‌గా ఎంతంటే
విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీపై అందరిలో ఆసక్తి ఉంది. అందుకు తగ్గట్లే మార్కెట్ పరంగా ఇది బయ్యర్ల దృష్టిని ఆకట్టుకుంది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియా, కర్నాటకలో రూ. 3.00 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.50 కోట్లకు అమ్ముడైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 43 కోట్లు థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది.

అన్ని కోట్లు వస్తేనే హిట్
విజయ్ నటించిన 'ఫ్యామిలీ స్టార్' సినిమాకు భారీ స్థాయిలో రూ. 43 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 44.00 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే 'ఫ్యామిలీ స్టార్' సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తుంది. ఇదిలా ఉండగా.. విజయ్ గత చిత్రాలు 'ఖుషి', 'లైగర్' కంటే ఇది తక్కువ బిజినెస్ అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











