Kushi Collections: రూ.52.50 కోట్ల బిజినెస్... 11 రోజుల్లో వచ్చిందంతే.. ఇక ఖుషి గట్టక్కడం కష్టమే!

విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు జోడీగా నటించిన సినిమా 'ఖుషి'. ఈ సినిమా థియేటర్లోకి సెప్టెంబర్ 1న వచ్చింది. శివ నిర్వాణ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి దీన్ని నిర్మించారు. ఇక మొదటి రోజు నుంచి ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాకు 11 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలతో ఖుషి సినిమాతో ముందుకు వచ్చాడు. ఇక ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.

Vijay Devarakonda Starrer Kushi Movie 11 Days Official Box Office Collections

విజయ్ దేవరకొండ‌'ఖుషి' మూవీకి మాత్రం నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 41 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. వరల్డ్ వైడ్‌గా దీనికి రూ. 52.50 కోట్లు బిజినెస్ నమోదు చేసుకుంది.

ఇక జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. వాటితో సగం థియేటర్లను ఖుషి సినిమా కోల్పోయింది. అయినా కూడా... ఈ సినిమా సూపర్ కలెక్షన్లను సాధిస్తోంది. తమిళ్ లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ తోనే పరుగులు పెడుతోంది. ఈ సినిమా 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.31 లక్షలు వసూలు చేసింది. ఇక 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.11 లక్షలు వసూళ్లు రాబట్టింది. ఖుషి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా... రూ.30 లక్షలు షేర్ వసూలు చేయగా...రూ.65 లక్షలు గ్రాస్ రాబట్టింది.

Vijay Devarakonda Starrer Kushi Movie 11 Days Official Box Office Collections

ఖుషి ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల కలెక్షన్స్ గమనిస్తే... నైజాం రూ.13.35 కోట్లు, సీడెడ్ రూ.2.31 కోట్లు, ఉత్తర ఆంధ్ర రూ.2.85 కోట్లు, తూర్పు రూ.1.45 కోట్లు, పశ్చిమ రూ.1.11 కోట్లు, గుంటూరు రూ.1.37 కోట్లు, కృష్ణ రూ.1.37 కోట్లు, నెల్లూరు రూ.76లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 11 రోజుల్లో 24.57 కోట్ల షేర్ (రూ.41.05CR గ్రాస్) రాబట్టింది.

Vijay Devarakonda Starrer Kushi Movie 11 Days Official Box Office Collections

ఇక ఖుషి మూవీ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 3.38కోట్లు రాబట్టగా... ఇతర భాషలు రూ. 3.65కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ రూ.8.80 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.40.40 కోట్లు షేర్ (రూ.76.35కోట్ల గ్రాస్) రాబట్టింది. విజయ్ దేవరకొండ ఖుషి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 53.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్లోకి వచ్చింది. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ.13.10 కోట్ల వసూలు చేస్తేనే హిట్ సాధించనుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X