The FAMILY STAR 3 Days Collections: సండే షాకింగ్ కలెక్షన్లు.. 3 రోజుల్లో అన్ని కోట్లు.. హిట్ కావాలంటే!

ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండానే హీరోగా పరిచయం అయినా.. తనదైన సినిమాలతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. అప్పటి నుంచి వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇలా ఈ మధ్య హిట్ లేక ఇబ్బంది పడుతోన్న అతడు.. 'ది ఫ్యామిలీ స్టార్' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ముఖ్యంగా వీకెండ్‌లో కూడా డల్ అయింది. మరి 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

ఫ్యామిలీ స్టార్‌గా వచ్చేశాడుగా
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీనే 'ది ఫ్యామిలీ స్టార్'. పరశురాం పెట్ల రూపొందించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో జగపతి బాబు, వెన్నెల కిశోర్, రోహిణి తదితరులు నటించారు.

Vijay Devarakonda Starrer The FAMILY STAR Movie 3 Days Worldwide Collections Details

ఫ్యామిలీ స్టార్ బిజినెస్ ఇలా
విజయ్ దేవరకొండ నటించిన 'ది ఫ్యామిలీ స్టార్'కు నైజాంలో రూ. 13.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 17.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 34.50 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.50 కోట్లతో కలిపి దీనికి రూ. 43 కోట్లు బిజినెస్ అయింది.

3వ రోజు ఇలా.. మొత్తంగా
సరైన హిట్ కోసం వేచి చూస్తున్న విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాకు మూడో రోజు రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఫలితంగా ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.10 కోట్లు షేర్ మాత్రమే వసూలు అయింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.60 కోట్లు వరకూ వచ్చింది. ఇలా ఇప్పటి వరకూ ఈ మూవీ రూ. 12 కోట్లు వరకూ షేర్ రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X