The FAMILY STAR 4 Days Collections: విజయ్‌కు పెద్ద దెబ్బ.. 4 రోజుల్లో ఇంతేనా.. ఎన్ని కోట్లు రావాలంటే!

టాలీవుడ్‌లో చాలా మంది యంగ్ హీరోలు తమదైన రీతిలో ప్రభావాన్ని చూపించారు. తద్వారా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. ఈ మధ్య కాలంలో వరుసగా మూవీలు చేస్తోన్నా హిట్ కొట్టని అతడు.. ఇటీవలే 'ది ఫ్యామిలీ స్టార్' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా ఆశించిన రీతిలో దక్కడం లేదు. ఈ క్రమంలోనే వర్కింగ్ డేన మరింతగా డౌన్ అయిపోయింది. మరి 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

ఫ్యామిలీ స్టార్‌ ఎంట్రీ ఇచ్చాడు
విజయ్ దేవరకొండ నటించిన కుటుంబ కథా చిత్రమే 'ది ఫ్యామిలీ స్టార్'. పరశురాం పెట్ల రూపొందించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. ఇందులో జగపతి బాబు, వెన్నెల కిశోర్, రోహిణి తదితరులు నటించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

Vijay Devarakonda Starrer The FAMILY STAR Movie 4 Days Worldwide Collections Details

ఫ్యామిలీ స్టార్ బిజినెస్ ఇలా
విజయ్ దేవరకొండ 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాకు నైజాంలో రూ. 13.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 17.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 34.50 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.50 కోట్లతో కలిపి దీనికి రూ. 43 కోట్లు బిజినెస్ జరిగింది.

4వ రోజు ఎంత వచ్చింది?
చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న విజయ్ దేవరకొండ నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాకు రెస్పాన్స్ క్రమంగా పడిపోతూనే ఉంది. ముఖ్యంగా నాలుగో రోజు వర్కింగ్ డే కావడంతో ఈ మూవీకి స్పందన దారుణంగా వచ్చింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమా కేవలం రూ. 45 లక్షలు షేర్‌తో పాటు రూ. 90 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

Vijay Devarakonda Starrer The FAMILY STAR Movie 4 Days Worldwide Collections Details

4 రోజుల్లో ఎంత వచ్చింది?
4 రోజుల్లో 'ది ఫ్యామిలీ స్టార్' మూవీకి తక్కువ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా నైజాంలో రూ. 3.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 70 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 77 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 36 లక్షలు, గుంటూరులో రూ. 46 లక్షలు, కృష్ణాలో రూ. 40 లక్షలు, నెల్లూరులో రూ. 37 లక్షలతో కలిపి.. రూ. 7.13 కోట్లు షేర్, రూ. 12.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
విజయ్ దేవరకొండ నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' మూవీకి 4 రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 7.13 కోట్లు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 92 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 4.52 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 4 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 12.57 కోట్లు షేర్‌తో పాటు రూ. 23.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vijay Devarakonda Starrer The FAMILY STAR Movie 4 Days Worldwide Collections Details

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ది ఫ్యామిలీ స్టార్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 43 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 44 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 12.57 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 31.43 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X