FAMILY STAR 5 Days Collections: ఉగాది రోజు షాకింగ్‌గా.. మూవీకి వచ్చింది గోరంతే.. రావాల్సింది ఎంతంటే!
స్వయంకృషితోనే సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్లతో ప్రేక్షకులను మెప్పించి స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. మొదట్లో వరుసగా హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం పరాజయాలనే చూస్తున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని 'ది ఫ్యామిలీ స్టార్' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా సరిగా రావట్లేదు. ఈ క్రమంలోనే ఉగాది రోజున షాకింగ్ కలెక్షన్లు రాబట్టింది. మరి 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ 5 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి!
ఫ్యామిలీ స్టార్‌గా వచ్చేశాడు
విజయ్ దేవరకొండ హీరోగా.. పరశురాం పెట్ల తెరకెక్కించిన కుటుంబ సినిమానే 'ది ఫ్యామిలీ స్టార్'. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. ఇందులో జగపతి బాబు, వెన్నెల కిశోర్, రోహిణి తదితరులు నటించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

ఫ్యామిలీ స్టార్ బిజినెస్ ఇలా
విజయ్ దేవరకొండ నటించిన 'ది ఫ్యామిలీ స్టార్'కు నైజాంలో రూ. 13.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 17.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 34.50 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.50 కోట్లతో కలిపి దీనికి రూ. 43 కోట్లు బిజినెస్ అయింది.
5వ రోజు ఎంత వచ్చింది?
పరశురాం పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాకు 5వ రోజు ఉగాది హాలీడే ఉన్నా ఆశించిన రెస్పాన్స్ లభించలేదు. ఫలితంగా ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 90 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.20 కోట్లే వసూలు అయ్యాయి. ఇలా ఐదు రోజుల్లో విజయ్ సినిమా కేవలం రూ. 13.70 కోట్లే రాబట్టింది.



Click it and Unblock the Notifications











