FAMILY STAR 6 Days Collections: సగానికి సగం డౌన్.. 6 రోజుల్లో అన్ని కోట్లు.. విజయ్ హిట్ కొట్టాలంటే!
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే హీరోగా పరిచయమై.. అనతి కాలంలోనే మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా సంపాదించుకున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. దీనికితోడు ఆరంభంలోనే ఎన్నో హిట్లు కూడా కొట్టాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే విజయ్ 'ది ఫ్యామిలీ స్టార్' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా సరిగా రావట్లేదు. ఈ నేపథ్యంలో 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి!
ఫ్యామిలీ స్టార్‌గా క్రేజీ హీరో
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రమే 'ది ఫ్యామిలీ స్టార్'. పరశురాం పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో జగపతి బాబు, వెన్నెల కిశోర్, రోహిణి తదితరులు నటించారు.

ఫ్యామిలీ స్టార్ బిజినెస్ ఇలా
క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ 'ది ఫ్యామిలీ స్టార్'కు నైజాంలో రూ. 13.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 17.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 34.50 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.50 కోట్లతో కలిపి దీనికి రూ. 43 కోట్లు బిజినెస్ జరిగింది.
6వ రోజు ఇలా.. మొత్తంగా
పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' మూవీకి ఉగాది రోజు భారీ వసూళ్లు వచ్చాయి. కానీ, ఆరో రోజు ఈ చిత్రం సగానికి సగం డౌన్ అయిపోయింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 50 లక్షలు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 65 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇలా 6 రోజుల్లో ఈ సినిమా రూ. 14.50 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











