FAMILY STAR 7 Days Collections: 44 కోట్లు రావాలి.. కానీ వారంలో ఘోరంగా.. అది జరిగితేనే విజయ్‌కు హిట్
టాలీవుడ్‌లోకి ఎలాంటి అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చినా.. ఆరంభంలోనే వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అలా ఫుల్ జోష్‌లో సినిమాలు చేశాడు. కానీ, ఈ మధ్య కాలంలో సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే విజయ్ దేవరకొండ 'ది ఫ్యామిలీ స్టార్' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి మిక్స్‌డ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా సరిగా రావట్లేదు. ఈ నేపథ్యంలో 'ది ఫ్యామిలీ స్టార్' మూవీ 7 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!
ఫ్యామిలీ స్టార్‌గా రౌడీ ఎంట్రీ
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే 'ది ఫ్యామిలీ స్టార్'. పరశురాం పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. ఇందులో జగపతి బాబు, వెన్నెల కిశోర్, రోహిణి తదితరులు నటించారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.

ఫ్యామిలీ స్టార్ బిజినెస్ ఇలా
విజయ్ దేవరకొండ నటించిన 'ది ఫ్యామిలీ స్టార్'కు నైజాంలో రూ. 13.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 17.00 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 34.50 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.50 కోట్లతో కలిపి దీనికి రూ. 43 కోట్లు బిజినెస్ అయింది.
7వ రోజు ఇలా.. మొత్తంగా
పరశురాం పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమాకు రంజాన్ హాలీడే ఉండడంతో రెస్పాన్స్ భారీగా వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఇది తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు రూ. 55 లక్షలు షేర్ మాత్రమే వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా రూ. 70 లక్షలు రాబట్టింది. ఇలా వారంలో రూ. 13 కోట్లే కలెక్ట్ చేసింది.



Click it and Unblock the Notifications











