దిల్ రాజుకు ఫ్యామిలీ కష్టాలు

పెద్ద సినిమాలకు సహజంగానే భారీ బజ్ వుంటుంది. స్టార్ క్యాస్టింగ్, బడ్జెట్, ఇతరత్రా అంశాలు సినిమాపై హైప్ తీసుకొస్తాయి. కానీ విడుదలైన తర్వాత కానీ బొమ్మ హిట్టా, ఫట్టా అనేది తెలియదు. ఎంత పెద్ద హీరో నటించినా, స్టార్ డైరెక్టర్ టేకప్ చేసినా తమకు నచ్చకుంటే మొహమాటం లేకుండా సినిమాను రిజెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. నిర్మాతకు మూవీ రిలీజ్‌కు ముందే బిజినెస్ అయిపోతుంది కాబట్టి సేఫ్. కానీ ఎటోచ్చి నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లు , బయ్యర్లే. వీరి గురించి ఆలోచించేది, ఆర్ధికంగా సాయం చేసేది కొందరే.

అయితే ఆ కొందరినీ చూసి .. ఆ హీరో రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చాడు, ఆర్ధికంగా సాయం చేశాడు. మీరు కూడా వెనక్కి ఇవ్వండి అంటూ కొందరు దబాయించే పరిస్ధితి ప్రస్తుతం చిత్రసీమలో నెలకొంది. తాజాగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన '' ఫ్యామిలీ స్టార్ '' దర్శకుడు పరశురామ్ ఇదే పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. ఎన్నో అంచనాల మధ్య విడుదల ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బొల్తా పడటంతో బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు.

vijay devarakonda supports dilraju over buyers pressure for settle the losses of The Family Star movie

విజయ్ దేవరకొండ ఫాలోయింగ్‌తో పాటు పరశురామ్ ట్రాక్ రికార్డు చూసి సినిమాకు బాగానే గిట్టుబాటయ్యింది. కానీ ఫలితం తేడా కొట్టేయడంతో బయ్యర్లు మునిగిపోయారు. దీంతో తమను ఆదుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిని అడ్డుపెట్టుకుని.. డైరెక్టర్ పరశురామ్‌ని కూడా అలాగే చేయమని కొందరు అడుగుతున్నారట. ఫ్యామిలీ స్టార్ సినిమాకు గాను రూ.12 కోట్ల వరకు పారితోషికంగా అందుకున్నారట పరశురామ్. అందులో నుంచి తమకు కొంత పరిహారం చెల్లించాలని బయ్యర్లు ఆయనపై ఒత్తిడి చేస్తున్నట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ వివాదం పెద్దది కాకుండా సెటిల్ చేసేందుకు ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాత, పరిశ్రమ పెద్దల్లో ఒకరైన దిల్‌రాజు .. విజయ్ దేవరకొండ, పరశురామ్‌లతో మాట్లాడి వారికి సర్దిచెప్పగా ముగ్గురూ ఓ అవగాహనకు వచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ తన రెమ్యూనరేషన్‌లో కొంత వెనక్కి ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లుగా టాక్. పరశురామ్ కూడా దిల్‌రాజు మాటకు విలువిచ్చి కాస్త మెత్తడినట్లుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

vijay devarakonda supports dilraju over buyers pressure for settle the losses of The Family Star movie

ఇదిలావుండగా.. ఫ్యామిలీ స్టార్ మూవీపై దిల్‌రాజు సైతం ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. గత కొన్నేళ్లుగా సినిమాలపై దిల్‌రాజు గురి తప్పుతోంది. చాలా వరకు సినిమాలు తన్నేస్తున్నాయి. లేటెస్ట్ ఫ్యామిలీ స్టార్ మూవీ నష్టాల నుంచి ఎంతో కొంత రికవరీ అయ్యేందుకు గాను ఆయన కొత్త ఎత్తుగడ వేసినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

డిజిటల్ రైట్స్ ద్వారా కొంత వరకు పెట్టుబడిని రికవరీ చేసుకోవాలని దిల్‌రాజు భావిస్తున్నారట. అంటే డిజిటల్ స్ట్రీమింగ్ యాప్‌లో రెంటల్ విధానంలో సినిమాను ప్రేక్షకుడికి అందించడమన్న మాట. థియేటర్‌లో ఫట్టయిన సినిమాలు, ఓటీటీ, టీవీల్లో హిట్టయిన సెంటిమెంట్‌ను దృష్టిలో వుంచుకుని దిల్‌రాజు ఈ ఎత్తుగడ వేసినట్లుగా విశ్లేషకుల అంచనా. మరి ఈ ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X