Kingdom Business: విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే భారీ బిజినెస్.. కింగ్డమ్ అక్కడ ఎన్ని కోట్లు వసూల్ చేయాలంటే?
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు తన రాబోయే చిత్రం కింగ్డమ్ తో భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. జెర్సీ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తుండటంతో కింగ్డమ్ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా బడ్జెట్, నార్త్ అమెరికాలో జరిగిన లేటెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఆసక్తికరంగా మారాయి. విజయ్ దేవరకొండ కెరీయర్ లో అత్యధిక లక్ష్యాన్ని ఆ ఏరియాలో చేరుకోవాలని ఉంది. ఈ సందర్భంగా విజయ్ ఎన్ని కోట్లు రాబట్టాల్సి ఉందనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
కింగ్డమ్ సినిమా బడ్జెట్ ఎంత?
స్పై యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం కింగ్డమ్. ఈ చిత్రాన్ని అఫీషియల్ గా 2023 జనవరిలో ప్రారంభించింది. విజయ్ దేవరకొండ 12వ చిత్రంగా రూపుదిద్దుకుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్యూన్ ఫర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియో బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రూ.100 కోట్ల బడ్జెట్ తో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తుండటం విశేషం. విజయ్ దేవరకొండ కెరీయర్ లోనే ఇది అత్యధిక బడ్జెట్ చిత్రం కావడం విశేషం.

కింగ్డమ్ సినిమా నార్త్ అమెరికా బిజినెస్?
విజయ్ దేవరకొండ సినిమాలకు నార్మల్ గానే తెలుగు స్టేట్స్ లో భారీ హైప్ ఉంటుంది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ స్టార్ హీరోగా ఎదిగారు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ సినిమాలకు భారీ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో కింగ్డమ్ సినిమాకు ఓవర్సీస్ లో భారీ ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. కేవలం నార్త్ అమెరికాలో కింగ్డమ్ సినిమా 2.1 మిలియన్ల డాలర్లకు డిస్ట్రిబ్యూషన్ హక్కులను అమ్మడం విశేషం. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ అక్కడ ఈ స్థాయిలో బిజినెస్ చేయలేదు.
కెరీయర్ లోనే భారీ లక్ష్యం..
ప్రస్తుతం తెలుగు చిత్రాలకు ఓవర్సీస్ లోనూ భారీ డిమాండ్ ఉంటోంది. నార్త్ అమెరికాలో తెలుగు సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఉండటంతో స్టార్ హీరోల చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూల్లు అందుతుంటాయి. అయితే విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రంతో కేవలం నార్త్ అమెరికాలోనే రూ.18 కోట్ల వరకు తిరిగి రాబట్టాలని ట్రేడ్ నిపుణులు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను నిర్దేశించారు. ఇంత మొత్తం అంటే విజయ్ దేవరకొండకు భారీ లక్ష్యమనే అంటున్నారు. సినిమా బ్లాక్ బాస్టర్ అయితేనే ఆ స్థాయిలో, అంతకు మించి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.
కింగ్డమ్ రిలీజ్ డేట్, ఇతర వివరాలు..
గౌతమ్ తిన్ననూరి - విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న కింగ్డమ్ చిత్రం తొలుత జూలై 4, 2025న విడుదల కావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా 2025 జూలై 31న విడుదల కాబోతోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విజయ్ సరసన నటించింది. సత్య దేవ్ కీలక పాత్ర పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











