twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డియర్ కామ్రేడ్ ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి

    |

    Recommended Video

    Dear Comrade First Day Collections Report || Filmibeat Telugu

    యంగ్ డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించారు. గత సినిమాల ప్రభావంతో ఇప్పటికే వీరికి క్రేజీ జోడీగా పేరుండటం కారణంగా సినిమాపై భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు టీజర్, ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఓ రేంజ్ అంచనాల నడుమ జులై 26 వ తేదీన విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తొలి రోజు ముగిసే సరికి ఈ సినిమా రాబట్టిన కలెక్షన్ వివరాలు చూస్తే..

    రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి

    రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి

    రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా భారీ రేంజ్‌లో ఓపెన్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్‌ఫుల్ ఆకుపెన్సీతో సందడి వాతవరణం కనిపించింది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రలో కలిపి ఈ సినిమా 7. 49 కోట్లు రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

    ఏరియా వైస్‌గా చూస్తే..

    ఏరియా వైస్‌గా చూస్తే..

    నిజాం 3.02 కోట్లు, సీడెడ్ 0.88 కోట్లు, నెల్లూరు 0.26 కోట్లు, గుంటూరు 62.50 లక్షలు
    కృష్ణా 0.38 కోట్లు, వెస్ట్ గోదావరి 53.25 లక్షలు, ఈస్ట్ గోదావరి 0.90 కోట్లు అదేవిధంగా ఉత్తరాంధ్రలో 88.72 లక్షల రూపాయల వసూళ్లు రాబట్టింది డియర్ కామ్రేడ్.

    యూఎస్‌లో ఫస్ట్ వీకెండ్ 1 మిలియన్ గ్యారంటీ!

    యూఎస్‌లో ఫస్ట్ వీకెండ్ 1 మిలియన్ గ్యారంటీ!

    మరోవైపు యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ షోల ద్వారా 273,000 డాలర్లు రాబట్టింది డియర్ కామ్రేడ్. ఈ లెక్కన చూస్తే ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి 1 మిలియన్ డాలర్ల వసూళ్లు గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా యూఎస్ఏలో సైతం కన్నడ, మలయాళం, తమిళ వెర్షన్ కూడా విడుదల చేస్తుండటం వసూళ్ల పరంగా కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.

    టాక్ పరంగా చూస్తే..

    టాక్ పరంగా చూస్తే..

    చిత్రంలో విజయ్, రష్మిక కెమిస్ట్రీకి మరోసారి మంచి మార్కులు పడ్డాయి. విజయ్ గత చిత్రాలైన టాక్సీవాలా, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలకంటే 'డియర్ కామ్రేడ్' బెటర్ అని మాత్రం చెప్పలేము అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.

    డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

    డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్


    డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. ‘డియర్ కామ్రేడ్' మూవీ రైట్స్ తెలుగు రాష్ట్రాల్లో రూ. 22 కోట్లకు అమ్ముడైనట్లు తెలిసింది. వరల్డ్ వైడ్ అన్ని ఏరియాల్లో కలిపి రూ. 34 కోట్లకు సినిమాను అమ్మినట్లు సమాచారం. విజయ్ కెరీర్లో ది బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్‌గా దీన్ని పేర్కొంటున్నారు.

    English summary
    Vijay Deverakonda and Rashmika Mandanna new movie Dear Comrade. This movie released on july 26 and getting mixed talk from the audians. Dear Comrade First day collections report is.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X