డియర్ కామ్రేడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్ రిపోర్ట్.. కాస్త వీకే మరి
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రూపొందిన 'డియర్ కామ్రేడ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. భారీ అంచనాలతో గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా నిన్నటితో వారం పూర్తి చేసుకుంది. విడుదలైన తొలి రోజే ఓపెనింగ్స్ పరంగా అదరగొట్టిన ఈ సినిమా.. తర్వాత మిక్డ్స్ టాక్ రావడంతో వసూళ్ల జోరు కాస్త తగ్గించింది. ఓవరాల్‌గా చూస్తే ఫస్ట్ వీక్ కాస్త వీక్ గానే ముగిసింది.
భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్నాటకలో ఆయా భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

'డియర్ కామ్రేడ్' సినిమా మొదటివారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13.5 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 20.49 కోట్ల షేర్ సాధించింది. అయితే ఇప్పటికీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు ఇంకా దూరంలో ఉంది. వీక్ డేస్ కలెక్షన్స్ భారీగా తగ్గడంతో ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం దాదాపు వీలు కాదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఏరోయా వైస్‌గా చూస్తే డియర్ కామ్రేడ్ కలెక్షన్స్.. నైజామ్ లో 6.54 కోట్లు, సీడెడ్ లో 1.16 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.58 కోట్లు, కృష్ణాలో 0.74 కోట్లు, గుంటూరులో 1.04 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 1.19 కోట్లు, వెస్ట్ గోదావరిలో 0.89 కోట్లు, నెల్లూరులో 0.52 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.53 కోట్లు సాధించింది.


Click it and Unblock the Notifications











