గీత గోవిందం కలెక్షన్ల సునామీ.. సూపర్ పవర్‌స్టార్ స్టామినా ఇదే.. 100 కోట్లకు చేరువలో..

By Rajababu

Recommended Video

Vijay Devarakonda's Geetha Govindam Movie World Wide Collections

సూపర్ పవర్‌స్టార్ విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం వసూళ్లపరంగా దుమ్మురేపుతున్నది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబడుతున్నది. తొమ్మిది రోజుల్లో ఈ చిత్రం ట్రిపుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వంద కోట్ల క్లబ్‌ దూసుకెళ్తున్నది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి పరుశురాం దర్శకత్వం వహించారు. విజయ్‌కి జంటగా రష్మిక మందన్న నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా విడుదలై అఖండ విజయం వైపు దూసుకెళ్తున్నది. కలెక్షన్ల వివరాలు ఇలా..

రూ.100 కోట్లవైపు

రూ.100 కోట్లవైపు

అర్జున్‌రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా రావడంతో భారీ క్రేజ్ నెలకొన్నది. క్రేజ్ తగినట్టే సినిమా కూడా ఉండటంతో మొదటి ఆట నుంచే బ్లాకబస్టర్ టాక్‌ వచ్చేసింది. దాంతో భారీ కలెక్షన్లను సాధిస్తూ 100 కోట్ల క్లబ్‌ వైపు దూసుకెళ్తున్నది.

యూఎస్‌లో విజయ్ దేవరకొండ క్రేజ్

యూఎస్‌లో విజయ్ దేవరకొండ క్రేజ్

గీత గోవిందం మొదటి తొమ్మిది రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలివారం రూ.75 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్‌లో ప్రధానంగా యూఎస్‌లో రూ.12.6 కోట్ల గ్రాస్ (రూ.6.95 కోట్ల) కలెక్షన్లతో దూసుకెళ్తున్నది.

నైజాంలో బంపర్ హవా

నైజాంలో బంపర్ హవా

నైజాంలో గీతా గోవిందం చిత్రానికి అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. గత తొమ్మిది రోజుల్లో రూ.22.7 కోట్ల గ్రాస్ (12.72 కోట్ల నికర) వసూళ్లను సాధించింది. ఇంకా భారీ వసూళ్లను సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఆంధ్రాలో కలెక్షన్ల ప్రభంజనం

ఆంధ్రాలో కలెక్షన్ల ప్రభంజనం

తెలుగు రాష్ట్రంలో గీత గోవిందం ప్రభంజనం కొనసాగుతున్నది. ఆంధ్రలోని వైజాగ్‌లో రూ. 3.36 కోట్లు, తూర్పు గోదావరి రూ.2.41, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.99 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.2.42 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.2.41 కోట్లు వచ్చాయి. నెల్లూరులో 98 లక్షలు రాబట్టింది. ఆంధ్రాలో మొత్తంగా 20.2 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది.

సీడెడ్, కర్ణాటకలో ధాటిగా

సీడెడ్, కర్ణాటకలో ధాటిగా

గీత గోవిందం సీడెడ్‌లో కూడా మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ చిత్రం సీడెడ్‌లో రూ.6.5 కోట్ల గ్రాస్ (4.81 కోట్లు నికర) వసూళ్లను సాధించింది. కర్ణాటకలో ఈ చిత్రం 6.4 కోట్ల గ్రాస్ (2.85 కోట్లు నికరం), తమిళనాడులో రూ2.7 కోట్ల గ్రాస్ (1.05కోట్లు నికరం) కలెక్షన్లు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X