చిరంజీవి మూవీ రికార్డును దాటేసిన విజయ్ దేవరకొండ! (టాప్ 10 లిస్ట్)
'గీత గోవిందం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, రూ. 100 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేయడంతో.... విజయ్ దేవరకొండ పేరు మార్మోగిపోతోంది. ఇప్పటి వరకు ఉన్న పలు రికార్డులను సైతం ఈ మూవీ బద్దలు కొడుతూ దూసుకెళుతోంది.. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ మూవీ దుమ్మురేపుతోంది.
తాజాగా 'గీత గోవిందం' మూవీ చిరంజీవి 'ఖైదీ నెం.150' రికార్డును దాటేసి ముందుకు వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఇప్పటికే ఓవర్సీస్ మార్కెట్లో 2 మిలియన్ మార్క్ అందుకున్న ఈ మూవీ తాజా వసూళ్లు 2.449 మిలియన్ డాలర్లకు చేరుకోవడంతో ఓవర్సీస్ టాప్ 10 వసూలు సాధించిన సినిమాల జీబితాలో 8వ స్థానానికి ఎగబాకింది.

చిరంజీవి మూవీ రికార్డును దాటేసిన విజయ్
ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటి వరకు 2.447 మిలియన్ డాలర్ల వసూళ్లతో 8వ స్థానంలో ఉన్న ఖైదీ నెం. 150 స్థానాన్ని ‘గీత గోవిందం' ఆక్రమించడంతో ఆ మూవీ 9వ స్థానికి పడిపోయింది. ఓవర్సీస్ రికార్డుల లిస్టులో ఇప్పటి వరకు బాహుబలి సిరీస్ మూవీస్ తొలి రెండు స్థానాలను ఆక్రమించగా, మూడో స్థానంలో ‘రంగస్థలం' ఉంది.

టాప్ 10 మూవీస్ ఇవే
బాహుబలి 2 : 21 మిలియన్ డాలర్స్
బాహుబలి :$8.46 మిలియన్ (తెలుగు $6.99 మిలియన్)
రంగస్థలం: $3.416 మిలియన్
భరత్ అనే నేను: $3.416 మిలియన్
శ్రీమంతుడు: $2.891 మిలియన్
మహానటి: $2.544 మిలియన్
అ..ఆ: $2.45 మిలియన్
గీత గోవిందం: $2.449 మిలియన్
ఖైదీ నెం.150: $2.447 మిలియన్
ఫిదా: $2.067 మిలియన్

విజయ్ కెరీర్లోనే బిగ్ మూవీ
విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ సినిమాగా ‘గీత గోవిందం' నిలిచింది. ఈ సినిమాతో స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే రూ. 100 కోట్ల మార్కును విజయ్ అందుకోవడం ద్వారా నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోయాడు.

టాలీవుడ్ సరికొత్త స్టార్
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ టాలీవుడ్లో సరికొత్త స్టార్ హీరోగా అవతరించాడని, ఇపుడు విజయ్ మామూలు హీరో కాదని, స్టార్ హీరో అని మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రశంసించిన సంగతి తెలిసిందే. విజయ్ త్వరలో ‘నోటా' ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











