twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవర జోరు.. మూడోస్థానంలో దూసుకెళ్తున్న టాక్సీవాలా!

    |

    విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రం పైరసీ రక్కసిని ఎదురిస్తూ వసూళ్లపరంగా దూసుకెళ్తున్నది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా టాక్సీవాలా డిస్టిబ్యూటర్లు విడుదలైన ఆరు రోజులకే లాభాల్లోకి చేరుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విడుదలకు ముందే ఈ సినిమా మొత్తం పైరసీ వెబ్‌సైట్లో లీక్ అయిన సంగతి తెలిసిందే. తొలివారం వసూళ్లు ఇలా ఉన్నాయి..

    టాక్సీవాలా 25 కోట్ల మార్కు

    టాక్సీవాలా 25 కోట్ల మార్కు

    టాక్సీవాలా చిత్రం రిలీజ్ రోజు తొలి ఆట నుంచే పాజిటివ్ ఆటతో దూసుకెళ్లింది. తొలి వారాంతంలో రూ.10.53 కోట్లు, తొలివారం ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.27.83 కోట్ల గ్రాస్ (ఆరురోజులకు) సాధించింది. డిస్టిబ్యూటర్లకు రూ.14.56 కోట్లు సాధించిపెట్టింది. కేవలం విజయ్ దేవరకొండ క్రేజ్‌తోనే ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

    ఏపీ, తెలంగాణలో

    ఏపీ, తెలంగాణలో

    తెలుగు రాష్ట్రాల్లో కూడా టాక్సీవాలా సినిమా కలెక్షన్లు భారీగానే ఉన్నాయి. నైజాంలో ఈ చిత్రం రూ.4.61 కోట్లు, సీడెడ్‌లో రూ.1.39 కోట్లు, వైజాగ్‌లో రూ.1.25 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ. 63 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.62 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.83 లక్షలు, గుంటూరు జిల్లాలో రూ.1.39 కోట్లు, నెల్లూరులో రూ.34 లక్షలు వసూలు చేసింది.

    వీక్ కాదు... పీక్: వాళ్లకు చుక్కలు చూపించిన ‘టాక్సీవాలా', నిర్మాత ట్వీట్!వీక్ కాదు... పీక్: వాళ్లకు చుక్కలు చూపించిన ‘టాక్సీవాలా', నిర్మాత ట్వీట్!

    తెలుగు రాష్ట్రాల్లో కలిపి

    తెలుగు రాష్ట్రాల్లో కలిపి

    తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లు సాధిస్తున్నది. తెలంగాణ, ఏపీలో టాక్సీవాలా మొత్తంగా రూ.11.06 కోట్ల కలెక్షన్లు వచ్చాయి, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.1.90 కోట్లు సాధించింది. మొత్తంగా ఈ చిత్రం రూ.14.56 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది.

     నోటాను అధిగమించి..

    నోటాను అధిగమించి..

    విజయ దేవరకొండ నటించిన నోటా చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద రూ.25.40 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం నోటా కలెక్షన్లను టాక్సీవాలా కేవలం ఆరు రోజుల్లోనే అధిగమించింది. ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ సమయంలో అమ్ముడు పోవడం గమనార్హం.

    మూడోస్థానంలో టాక్సీవాలా

    మూడోస్థానంలో టాక్సీవాలా

    విజయ్ దేవరకొండ కెరీర్‌లో టాక్సీవాలా చిత్రం మూడోస్థానంలో నిలిచింది. గీతా గోవిందం రూ.75 కోట్ల నికర వసూళ్లు సాధించగా, అర్జున్ రెడ్డి రూ.31.10 కోట్లు వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం టాక్సీవాలా రూ.రూ.27.83 కోట్లు, నోటా రూ.25.40 కోట్లు కలెక్షన్లను సాధించాయి.

    English summary
    Taxiwala has collected Rs 17.30 crore gross in the (2 days) first weekend and Rs 10.53 crore gross on the weekdays. Its six-day total collection stands at Rs 27.83 crore gross.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X