twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాక్సీవాలా వసూళ్ల హల్‌చల్.. విజయ్ దేవరకొండ టీమ్‌కు అల్లు అర్జున్ దిమ్మతిరిగే పార్టీ..

    |

    టాలీవుడ్‌లో అందరి అంచనాలను తలకిందులూ చేస్తూ టాక్సీవాలా చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నది. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే పైరసీకి గురై పలు వెబ్‌సైట్లలో రిలీజ్ కావడంతో సినిమా యూనిట్ ఆశలు వదిలేసుకొన్నది. అయితే నవంబర్ 17న రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. దీంతో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన పార్టీతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే..

    'టాక్సీవాలా' సంచలనం... తొలి రోజే పెట్టుబడి రాబట్టింది!'టాక్సీవాలా' సంచలనం... తొలి రోజే పెట్టుబడి రాబట్టింది!

    భారీగా టాక్సీవాలా రిలీజ్

    భారీగా టాక్సీవాలా రిలీజ్

    గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా టాక్సీవాలాను నిర్మించింది. ఈ చిత్రానికి జర్నలిస్టు ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహారించాడు. ప్రియాంకా జవాల్కర్, మాళవిక నాయర్ నటించిన ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 750 స్క్రీన్లలో ప్రదర్శించారు. చిత్ర యూనిట్ ఊహించని విధంగా శనివారం బ్రహ్మాండమైన ఒపెనింగ్స్ వచ్చాయి.

    రెండు రోజుల్లో కలెక్షన్లు

    రెండు రోజుల్లో కలెక్షన్లు

    టాక్సీవాలాకు తొలి ఆట నుంచి ప్రేక్షకుల నుంచి సానుకూలమైన టాక్ వచ్చింది. గత రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.15 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ చిత్రం పంపిణిదారులకు రూ.8 కోట్ల వసూళ్లను సాధించిపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్ రిలీజ్ చేసింది.

    తొలి రోజే లాభాల్లోకి

    తొలి రోజే లాభాల్లోకి

    టాక్సీవాలా చిత్రానికి సంబంధించిన ఇతర ప్రాంతాల బిజినెస్ అర్జున్ రెడ్డి సినిమాకు ముందే జరిగింది. విజయ్ దేవరకొండకు పెద్దగా క్రేజ్ లేకపోవడంతో తక్కువ మొత్తానికే సినిమాను అమ్మారు. అయితే తొలిరోజే పలు ప్రాంతాలో పెట్టిన పెట్టుబడి రావడమే కాకుండా లాభాల్లోకి వెళ్లినట్టు చెప్పుకొంటున్నారు.

    టీమ్‌కు అల్లు అర్జున్ పార్టీ

    టీమ్‌కు అల్లు అర్జున్ పార్టీ

    ఇలా సెన్సేషనల్ హిట్ కావడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాక్సీవాలా యూనిట్‌కు అదివారం రాత్రి విలాసవంతమైన పార్టీని ఏర్పాటు చేశారు. విజయ్ దేవరకొండతోపాటు చిత్ర యూనిట్ హాజరైంది. మెగా ఫ్యాన్ అయిన నిర్మాత ఎస్‌కేఎన్ కావడంతో మొదటి నుంచి బన్నీ ఈ చిత్రాన్ని ప్రోత్సాహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

    కామెడీ థ్రిల్లర్‌గా టాక్సీవాలా

    కామెడీ థ్రిల్లర్‌గా టాక్సీవాలా

    టాక్సీవాలా చిత్రం హారర్, సైంటిఫిక్ ఫిక్షన్, కామెడీ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వం వహించారు. బన్నీ వాస్, వీ వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మాణ సారథ్యంలో ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. సిజ్లు, ఉత్తేజ్, రవి ప్రకాశ్ ఇతర పాత్రల్లో నటించారు.

    English summary
    Taxiwala is a horror, sci-fi, comedy thriller film which has been written and directed by Rahul Sankrityan. Vijay Deverakonda's Taxiwaala has made a good collection at the box office and become a profitable venture in just two days. Stylish star Allu Arjun hosted a lavish party for the team to celebrate its success on Sunday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X