Kushi 10 Days Collections: సండే షాకింగ్ వసూళ్లు.. 10 రోజుల్లో అన్ని కోట్లే.. అదే జరిగితే ఖుషి ఫ్లాప్
ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. అనతి కాలంలోనే అదిరిపోయే ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. దీనికితోడు ఆరంభంలోనే హిట్లు రావడంతో స్టార్‌డమ్ కూడా దక్కింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం అతడు ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే 'ఖుషి' మూవీతో వచ్చాడు. దీనికి మంచి టాక్‌తో పాటు ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. కానీ, ఆ తర్వాత క్రమంగా డౌన్ అవుతోంది. ఆదివారం కూడా తేలిపోయింది. మరి 'ఖుషి' మూవీ 10 రోజుల రిపోర్టును మీరే చూడండి!
ఖుషి అంటూ వచ్చిన కపుల్:విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు జోడీగా నటించిన సినిమానే 'ఖుషి'. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి దీన్ని నిర్మించారు. ఇందులో సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.

ఖుషి మూవీ బిజినెస్ డీటేల్స్:ఈ మధ్య విజయం లేకున్నా విజయ్ దేవరకొండ'ఖుషి' మూవీకి మాత్రం నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 41 కోట్ల బిజినెస్ చేసింది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. వరల్డ్ వైడ్‌గా దీనికి రూ. 52.50 కోట్లు బిజినెస్ అయింది.
10వ తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు:'ఖుషి' మూవీకి 10వ రోజు ఆంధ్రా, తెలంగాణలో రెస్పాన్స్ మళ్లీ తగ్గిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 31 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ వసూలైంది.

10 రోజులకు కలిపి ఎంతంటే:10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 'ఖుషి'కి డీసెంట్ రెస్పాన్సే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 13.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.84 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.45 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.11 కోట్లు, గుంటూరులో రూ. 1.37 కోట్లు, కృష్ణాలో రూ. 1.36 కోట్లు, నెల్లూరులో రూ. 75 లక్షలతో కలిపి.. రూ. 24.46 కోట్లు షేర్, రూ. 40.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఏపీ, తెలంగాణలో రూ. 24.46 కోట్లు రాబట్టిన 'ఖుషి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.36 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.78 కోట్లు, వేరే భాషలకు సంబంధించిన వెర్షన్లలో రూ. 3.50 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 10 రోజుల్లో ఖుషికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 40.10 కోట్లు షేర్, రూ. 77.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఫీల్ గుడ్ స్టోరీతో వచ్చిన 'ఖుషి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53.50 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 40.10 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 13.40 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











