Kushi 1st Week Collections: 53 కోట్లు సినిమా.. వారంలో మరీ ఇంతేనా.. ఇంకెన్ని కోట్లు వస్తే హిట్ అంటే!
విలక్షణమైన నటన, విభిన్నమైన శైలితో సినిమాలు చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. ఆరంభంలో మాదిరిగా ఈ మధ్య కాలంలో విజయాలను సొంతం చేసుకోలేకపోతోన్న అతడు.. ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్‌ను ఎక్కాలన్న పట్టుదలతో 'ఖుషి' మూవీని చేశాడు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రానికి ఫస్ట్ వీకెండ్‌లో వసూళ్లు పోటెత్తాయి. కానీ, ఆ తర్వాత క్రమంగా డౌన్ అవుతూ వస్తోంది. ఇలా వారంలో తక్కువ కలెక్షన్లే రాబట్టింది. మరి 'ఖుషి' మూవీ 7 రోజుల రిపోర్టును చూద్దాం పదండి!
ఫీల్ గుడ్ లవ్ స్టోరీతోనే ఖుషి:విజయ్ దేవరకొండ, సమంత రూత్ కాంబోలో వచ్చిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీనే 'ఖుషి'. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఈ మూవీకి హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్‌ను ఇచ్చాడు. ఇందులో జయరాం, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలను పోషించారు.

ఖుషి మూవీ బిజినెస్ డీటేల్స్:కొంత కాలంగా హిట్ లేకున్నా విజయ్ దేవరకొండ చేసిన'ఖుషి' మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 41 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రానికి రూ. 52.50 కోట్లు బిజినెస్ జరిగింది.

7వ తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు:'ఖుషి' మూవీ 7వ రోజూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరింత పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 21 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 36 లక్షలు షేర్, రూ. 75 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

7 రోజులకు కలిపి ఎంతంటే:తెలుగు రాష్ట్రాల్లో 'ఖుషి'కి 7 రోజుల్లో మంచి రెస్పాన్సే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 12.76 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.21 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.75 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.40 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.08 కోట్లు, గుంటూరులో రూ. 1.34 కోట్లు, కృష్ణాలో రూ. 1.30 కోట్లు, నెల్లూరులో రూ. 71 లక్షలతో కలిపి.. రూ. 23.55 కోట్లు షేర్, రూ. 39.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఏపీ, తెలంగాణలో రూ. 23.55 కోట్లు రాబట్టిన 'ఖుషి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.50 కోట్లు, వేరే భాషలకు సంబంధించిన వెర్షన్లలో రూ. 3.05 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.30 కోట్లు షేర్, రూ. 75.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ఖుషి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53.50 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో దీనికి రూ. 38.30 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 15.20 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

బ్రేక్ ఈవెన్ చేరడం కష్టమే:విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపొందిన 'ఖుషి' మూవీకి ఓపెనింగ్స్ మంచిగానే వచ్చినా.. వర్కింగ్ డేస్‌లో మాత్రం ఇది తేలిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా స్పందన తగ్గిపోయింది. ఇక, ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సినిమా టార్గెట్‌ను చేరడం కష్టం అవడంతో పాటు నష్టాలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications











