Kushi 2 Days Collections: చరిత్ర సృష్టించిన ఖుషి.. 2 రోజుల్లోనే అన్ని కోట్లు.. తెలుగులో ఫస్ట్ మూవీగా!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో భారీ స్థాయిలో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న వాళ్లు కొందరే ఉన్నారు. అందులో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. హీరోగా పరిచయమైన కొత్తలో వరుసగా విజయాలను అందుకున్న అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం సక్సెస్‌లను సొంతం చేసుకోవడం లేదు.

ఈ పరిస్థితుల్లోనే తాజాగా 'ఖుషి' మూవీతో వచ్చాడు. దీనికి మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో రెండో రోజు కూడా కలెక్షన్లు భారీ స్థాయిలోనే లభించాయి. ఈ నేపథ్యంలో అసలు 'ఖుషి' మూవీ రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూడండి!

Vijay Deverakonda Starrer Kushi Movie 2 Days Official Box Office Collections

ఖుషి అంటూ వచ్చిన విజయ్: విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ తీసిన సినిమానే 'ఖుషి'. సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఇందులో జయరాం, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించాడు.

Vijay Deverakonda Starrer Kushi Movie 2 Days Official Box Office Collections

ఖుషి మూవీ బిజినెస్ డీటేల్స్: విజయ్ దేవరకొండ‌కు ఈ మధ్య హిట్ లేకున్నా 'ఖుషి' మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 41 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 52.50 కోట్లు బిజినెస్ చేసింది.

Vijay Deverakonda Starrer Kushi Movie 2 Days Official Box Office Collections

2వ తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు: 'ఖుషి'కి ఆంధ్రా, తెలంగాణలో 2వ రోజూ భారీ స్పందన వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.30 కోట్లు, సీడెడ్‌లో రూ. 43 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 56 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 26 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 27 లక్షలు, కృష్ణాలో రూ. 26 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి.. రూ. 5.36 కోట్లు షేర్, రూ. 9.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vijay Deverakonda Starrer Kushi Movie 2 Days Official Box Office Collections

2 రోజులకు కలిపి ఎంతంటే: తెలుగు రాష్ట్రాల్లో 'ఖుషి'కి 2 రోజుల్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 8.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.34 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.69 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 92 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 78 లక్షలు, గుంటూరులో రూ. 93 లక్షలు, కృష్ణాలో రూ. 70 లక్షలు, నెల్లూరులో రూ. 42 లక్షలతో కలిపి.. రూ. 15.23 కోట్లు షేర్, రూ. 24.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vijay Deverakonda Starrer Kushi Movie 2 Days Official Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రా, తెలంగాణలో రూ. 15.23 కోట్లు రాబట్టిన 'ఖుషి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.95 కోట్లు, వేరే భాషలకు సంబంధించిన వెర్షన్లలో రూ. 1.05 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 2 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 23.83 కోట్లు షేర్‌, రూ. 51 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vijay Deverakonda Starrer Kushi Movie 2 Days Official Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ఖుషి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 23.83 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 29.67 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Vijay Deverakonda Starrer Kushi Movie 2 Days Official Box Office Collections

విజయ్ సంచలన రికార్డు: విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషి' మూవీకి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వేరే ప్రాంతాల్లోనూ ఇది సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో అప్పుడే 1 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. అంతేకాదు, మొదటి రోజు 350K డాలర్ల వసూళ్లను రాబట్టింది. దీంతో 2023లోనే ఓవర్సీస్‌లో ఫస్ట్ డే ఎక్కువ రాబట్టిన చిత్రంగా రికార్డు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X