Kushi 3 Days Collections: సండే షాకింగ్‌గా.. అప్పుడే అన్ని కోట్లా.. ఇంకెన్ని కోట్లు వస్తే హిట్ అంటే!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఫాలోయింగ్‌ను ఏర్పరచుకోవడం అంటే చాలా కష్టమైన పనే అని చెప్పాలి. అలాంటిది ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే, ఐదేళ్లుగా హిట్ వాసన చూడని అతడు.. ఇప్పుడు 'ఖుషి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా బాగానే లభిస్తోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'ఖుషి' మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
సమంతతో వచ్చేసిన విజయ్:విజయ్ దేవరకొండ - సమంత రూత్ ప్రభు జంటగా శివ నిర్వాణ తెరకెక్కించిన ప్రేమకథా సినిమానే 'ఖుషి'. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఇందులో జయరాం, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని ఇచ్చాడు.

ఖుషి మూవీ బిజినెస్ డీటేల్స్:ఈ మధ్య విజయ్ దేవరకొండకు సక్సెస్ లేకున్నా 'ఖుషి' మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 41 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 52.50 కోట్లు బిజినెస్ జరిగింది.
3వ తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు:'ఖుషి'కి ఆంధ్రా, తెలంగాణలో 3వ రోజూ స్పందన మరింత పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 2.75 కోట్లు, సీడెడ్‌లో రూ. 69 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 77 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 22 లక్షలు, గుంటూరులో రూ. 33 లక్షలు, కృష్ణాలో రూ. 38 లక్షలు, నెల్లూరులో రూ. 20 లక్షలతో కలిపి.. రూ. 5.68 కోట్లు షేర్, రూ. 9.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజులకు కలిపి ఎంతంటే:3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 'ఖుషి'కి అదిరే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 11.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.03 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.46 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.26 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.00 కోట్లు, గుంటూరులో రూ. 1.26 కోట్లు, కృష్ణాలో రూ. 1.08 కోట్లు, నెల్లూరులో రూ. 62 లక్షలతో కలిపి.. రూ. 20.91 కోట్లు షేర్, రూ. 34.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఏపీ, తెలంగాణలో రూ. 20.91 కోట్లు రాబట్టిన 'ఖుషి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.45 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7.10 కోట్లు, వేరే భాషలకు సంబంధించిన వెర్షన్లలో రూ. 2.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 3 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 32.53 కోట్లు షేర్, రూ. 70 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ఖుషి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53.50 కోట్లుగా నమోదైంది. ఇక, 3 రోజుల్లో దీనికి రూ. 32.53 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 20.97 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

విజయ్ సంచలన రికార్డు:శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషి' మూవీకి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వేరే ప్రాంతాల్లోనూ ఇది సత్తా చాటుతోంది. ఇలా ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్‌లోనే రూ. 32.53 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. తద్వారా అతడి కెరీర్‌లో హయ్యేస్ట్ వీకెండ్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాగా ఇది రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











