Kushi 4 Days Collections: అక్కడ బ్రేక్ ఈవెన్ కొట్టేసిన ఖుషి... ఆ ప్రభావంతో తగ్గిన వసూళ్లు
విజయ్ దేవరకొండకు హిట్ మాట విని ఐదేళ్లు అయింది. ఇక ఖుషి సినిమాతో వచ్చి.. బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టి.. ఆ పదం వినేశారు. సమంత, విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం ఖుషి. ఇక ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇక ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ క్రమంలో ఖుషి మూవీ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
మహానటి తర్వాత విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన చిత్రం ఖుషి. ఇక మహానటిలో ఫుల్ లెంగ్త్ స్టోరీ కాకపోయినా... వీరి పాత్రలు ఆకట్టుకున్నాయి. ఈ సారి ఫుల్ లెంగ్త్, లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ ఖుషి గత శుక్రవారం రిలీజ్ అయి... పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ చిత్రానికి హృదయం సంగీత దర్శకుడు హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.

ఇక విజయ్ దేవరకొండ, సమంతలకు ఇద్దరికీ హిట్లు లేకపోయినా... విడుదలకు ముందే ఖుషి సినిమా మంచి బిజినెస్ జరుపుకుంది. ఈ మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్ లో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో రూ. 20 కోట్లు బిజినెస్ చేసుకోగా... మొత్తంగా తెలంగాణ, ఏపీ కలిపి రూ. 41 కోట్ల బిజినెస్ నమోదు చేసుకుంది ఈ సినిమా. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ. 52.50 కోట్లు బిజినెస్ జరిగింది.

ఇక ఖుషి సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే... నైజాం రూ.11.86 కోట్లు, సీడెడ్ రూ.2.09 కోట్లు, ఉత్తర ఆంధ్రా రూ.2.57 కోట్లు, తూర్పు ఆంధ్ర రూ.1.31 కోట్లు, పశ్చిమ రూ.1.04 కోట్లు, గుంటూరు రూ.1.30 కోట్లు, కృష్ణ రూ.1.15 కోట్లు, నెల్లూరు రూ.64 లక్షలు వసూళ్లు రాబట్టింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మొత్తం కలుపుకుని రూ.21.96 షేర్ (రూ.36.20 కోట్ల గ్రాస్) రాబట్టింది.

ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.2.70 కోట్లు సాధించింది. ఇక ఇతర భాషల్లో రూ.2.40 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఓవర్సీస్ లో రూ.7.80 కోట్లు వసూలు చేసి... అక్కడ బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా ఖుషి సినిమాకు 34.86 షేర్ (రూ.65.05 కోట్ల గ్రాస్) సాధించింది.
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఖుషి 53.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా... బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 18.64 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాలి. నిజాంలో బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే ఇంకా నాలుగు కోట్లు సాధించాలి. ఇక వర్షం, వర్కింక్ డే ప్రభావంతో వసూళ్లు నిన్నటితో పొలిస్తే తగ్గాయి.


Click it and Unblock the Notifications











