Kushi 5 Days Collections: విజయ్‌కు బిగ్ షాక్.. అప్పుడే ఇంత తక్కువగా.. హిట్‌కు ఎన్ని కోట్లు రావాలంటే!

తెలుగు సినీ పరిశ్రమలో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న హీరోల్లో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. హీరోగా ప్రయాణాన్ని మొదలెట్టిన కొత్తలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను భారీగా పెంచుకున్నాడు. దీంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే, ఈ మధ్య పెద్దగా హిట్లు అందుకోని విజయ్.. ఇటీవలే 'ఖుషి' మూవీతో వచ్చాడు. దీనికి టాక్‌తో పాటు ఓపెనింగ్స్ కూడా భారీగా వచ్చాయి. అయితే, వీక్‌ డేస్‌లో ఇది డౌన్ అవుతోంది. మరి 'ఖుషి' మూవీ 5 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దామా!

ఖుషి అంటూ వచ్చిన కపుల్:విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు జంటగా నటించిన చిత్రమే 'ఖుషి'. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ప్రేమకథా సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఇందులో జయరాం, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.

Vijay Deverakonda Starrer Kushi Movie 5 Days Official Box Office Collections

ఖుషి మూవీ బిజినెస్ డీటేల్స్:విజయ్ దేవరకొండ‌కు కొంత కాలంగా సక్సెస్ లేకున్నా 'ఖుషి' మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 41 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రానికి రూ. 52.50 కోట్లు బిజినెస్ జరిగింది.

5వ తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు:'ఖుషి' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో 5వ రోజూ రెస్పాన్స్ బాగా తగ్గింది. ఫలితంగా నైజాంలో రూ. 40 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 75 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vijay Deverakonda Starrer Kushi Movie 5 Days Official Box Office Collections

5 రోజులకు కలిపి ఎంతంటే:5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 'ఖుషి'కి మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 12.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.67 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.36 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.06 కోట్లు, గుంటూరులో రూ. 1.32 కోట్లు, కృష్ణాలో రూ. 1.21 కోట్లు, నెల్లూరులో రూ. 67 లక్షలతో కలిపి.. రూ. 22.72 కోట్లు షేర్, రూ. 37.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vijay Deverakonda Starrer Kushi Movie 5 Days Official Box Office Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రా, తెలంగాణలో రూ. 22.72 కోట్లు రాబట్టిన 'ఖుషి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.92 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.05 కోట్లు, వేరే భాషలకు సంబంధించిన వెర్షన్లలో రూ. 2.62 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 5 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 36.31 కోట్లు షేర్‌, రూ. 73 కోట్లు గ్రాస్ వచ్చింది.

Vijay Deverakonda Starrer Kushi Movie 5 Days Official Box Office Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:లవ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ఖుషి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53.50 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లో దీనికి రూ. 36.31 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 17.19 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

Vijay Deverakonda Starrer Kushi Movie 5 Days Official Box Office Collections

ఐదో రోజే అంత తక్కువగా:శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషి' మూవీకి ఓపెనింగ్స్ భారీగానే వచ్చినా.. వీక్ డేస్‌లో మాత్రం ఇది తేలిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా రెస్పాన్స్ తగ్గిపోయింది. ఫలితంగా ఈ చిత్రానికి ఐదో రోజే రూ. కోటి కంటే తక్కువ షేర్ వచ్చింది. ఈ మధ్య కాలంలో మీడియం స్టార్ హీరోలకు ఇంత తక్కువ రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X