Kushi 6 Days Collections: విజయ్ మూవీకి మరో దెబ్బ.. 6వ రోజు 50 కూడా రాలేదు.. అదే జరిగితే హిట్ కష్టమే
సాధారణంగా యంగ్ హీరోలకు భారీ స్థాయిలో క్రేజ్ రావాలంటే చాలా కాలమే పడుతుంది. కానీ, కొందరు మాత్రం అనతి కాలంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్నారు. అందులో విజయ్ దేవరకొండ ఒకడు. హీరోగా వచ్చిన కొత్తలోనే ఎన్నో హిట్లను కొట్టిన అతడు.. రేంజ్‌ను పెంచుకున్నాడు. కానీ, చాలా కాలంగా విజయాన్ని మాత్రం అందుకోవట్లేదు. ఈ పరిస్థితుల్లోనే ఇటీవలే విజయ్ 'ఖుషి' మూవీతో వచ్చాడు. దీనికి మొదట్లోనే మంచి టాక్, ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. కానీ, తర్వాత ఇది డౌన్ అవుతూనే ఉంది. మరి 'ఖుషి' మూవీ 6 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!
ఖుషిగా వచ్చిన సామ్ విజయ్:విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు జోడీగా చేసిన చిత్రమే 'ఖుషి'. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ప్రేమకథా సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఈ మూవీకి హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్‌ను ఇచ్చాడు. ఇందులో జయరాం, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రల్లో కనిపించారు.

ఖుషి మూవీ బిజినెస్ డీటేల్స్:ఈ మధ్య హిట్ కొట్టకపోయినా విజయ్ దేవరకొండ చేసిన'ఖుషి' మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 41 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రానికి రూ. 52.50 కోట్లు బిజినెస్ అయింది.

6వ తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు:6వ రోజూ 'ఖుషి' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డౌన్ అయిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 28 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 47 లక్షలు షేర్, రూ. 85 లక్షలు గ్రాస్ వసూలు అయింది.
6 రోజులకు కలిపి ఎంతంటే:తెలుగు రాష్ట్రాల్లో 'ఖుషి'కి 6 రోజుల్లో మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 12.55 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.19 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.72 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.38 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.07 కోట్లు, గుంటూరులో రూ. 1.33 కోట్లు, కృష్ణాలో రూ. 1.26 కోట్లు, నెల్లూరులో రూ. 69 లక్షలతో కలిపి.. రూ. 23.19 కోట్లు షేర్, రూ. 38.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:ఆంధ్రా, తెలంగాణలో రూ. 23.19 కోట్లు రాబట్టిన 'ఖుషి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.45 కోట్లు, వేరే భాషలకు సంబంధించిన వెర్షన్లలో రూ. 2.95 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 37.69 కోట్లు షేర్, రూ. 75 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ఖుషి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53.50 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 37.69 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 15.81 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

అదే జరిగితే హిట్ కష్టమే:విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన 'ఖుషి' మూవీకి ఓపెనింగ్స్ భారీగానే వచ్చినా.. వీక్ డేస్‌లో మాత్రం ఇది తేలిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా రెస్పాన్స్ తగ్గిపోయింది. ఇక, ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సినిమా టార్గెట్‌ను చేరడం కష్టమే అని ట్రేడ్ విశ్లేషకులు అంచనాలను వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











