Kushi 9 Days Collections: పెరిగిన వసూళ్లు.. అయినా విజయ్‌కు నిరాశే.. ఇంకా అన్ని కోట్ల దూరంలోనే!
సాధారణంగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు ఇండస్ట్రీలో నిలదొక్కకోవడం కష్టమే. కానీ, అంతటి అసాధ్యాన్నే సుసాధ్యం చేసుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే, ఆరంభంలో హిట్లు కొట్టిన అతడు.. చాలా కాలంగా ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే 'ఖుషి' మూవీతో వచ్చాడు. దీనికి ఆరంభంలోనే మంచి టాక్‌తో పాటు ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ, ఆ తర్వాత వసూళ్లు డౌన్ అవుతున్నాయి. అలాంటిది ఇప్పుడు మళ్లీ పెరిగాయి. మరి 'ఖుషి' మూవీ 9 రోజుల రిపోర్టును మీరే చూడండి!

ఖుషిగా వచ్చిన విజయ్, సామ్: విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు జంటగా నటించిన క్రేజీ మూవీనే 'ఖుషి'. ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి దీన్ని నిర్మించారు. ఈ మూవీకి హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్‌ను ఇచ్చాడు. ఇందులో సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలు చేశారు.

ఖుషి మూవీ బిజినెస్ డీటేల్స్: కొంత కాలంగా సక్సెస్ లేకున్నా విజయ్ దేవరకొండ'ఖుషి' మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 41 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రానికి రూ. 52.50 కోట్లు బిజినెస్ జరిగింది.

9వ తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు: 9వ రోజు 'ఖుషి' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెస్పాన్స్ పెరిగిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో కలిపి.. రూ. 38 లక్షలు షేర్, రూ. 80 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

9 రోజులకు కలిపి ఎంతంటే: తెలుగు రాష్ట్రాల్లో 'ఖుషి'కి 9 రోజుల్లో డీసెంట్ రెస్పాన్సే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 13.10 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.27 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.82 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.42 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.10 కోట్లు, గుంటూరులో రూ. 1.36 కోట్లు, కృష్ణాలో రూ. 1.34 కోట్లు, నెల్లూరులో రూ. 74 లక్షలతో కలిపి.. రూ. 24.15 కోట్లు షేర్, రూ. 40.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఏపీ, తెలంగాణలో రూ. 24.15 కోట్లు రాబట్టిన 'ఖుషి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ నిరాశనే ఎదుర్కొంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.32 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.70 కోట్లు, వేరే భాషలకు సంబంధించిన వెర్షన్లలో రూ. 3.32 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 8 రోజుల్లో ఖుషికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 39.49 కోట్లు షేర్, రూ. 77 కోట్లు గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: రొమాంటిక్ స్టోరీతో వచ్చిన 'ఖుషి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53.50 కోట్లుగా నమోదైంది. ఇక, 9 రోజుల్లో దీనికి రూ. 39.49 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 14.01 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











