Kushi Day 1 Collections: ఖుషితో విజయ్ సంచలనం.. తొలి రోజే ఏకంగా అన్ని కోట్లు.. టాప్ మూవీగా రికార్డు
చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ తెలుగు సినిమాల్లో సందడి చేసి.. ఆ తర్వాత సోలో హీరోగా మారి.. ఆరంభంలోనే విశేషమైన గుర్తింపుతో సెన్సేషన్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. తొలినాళ్లలోనే హిట్లు మీద హిట్లు కొట్టిన అతడు.. క్రేజ్‌ను, మార్కెట్‌ను భారీగా పెంచుకున్నాడు.
అయితే, ఈ మధ్య కాలంలో ఫ్లాపుల పరంపరతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు విజయ్ 'ఖుషి' మూవీతో వచ్చాడు. దీనికి మంచి టాక్‌తో పాటు స్పందన కూడా లభించింది. ఫలితంగా ఈ సినిమా మొదటి రోజు వసూళ్లపై ఓ లుక్కేద్దాం పదండి!

ఖుషిగా ఎంట్రీ ఇచ్చిన విజయ్: విజయ్ దేవరకొండ - శివ నిర్వాణ కాంబోలో రూపొందిన సినిమానే 'ఖుషి'. సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించాడు. ఇందులో జయరాం, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రల్లో కనిపించారు.

ఖుషి మూవీ బిజినెస్ డీటేల్స్: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ఖుషి' మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 41.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, కర్నాకట ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 52.50 కోట్లు బిజినెస్ చేసింది.

అలాంటి టాక్.. ఫుల్ రెస్పాన్స్: క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'ఖుషి' మూవీకి అమెరికాలో వేసిన ప్రీమియర్ షోల నుంచే మంచి టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ అదే సీన్ కనిపించింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన దానికంటే ఎక్కువే దక్కింది. ముఖ్యంగా ఈవినింగ్ షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. దీంతో ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు.

తొలి తెలుగు రాష్ట్రాల్లో ఇలా: 'ఖుషి'కి ఆంధ్రా, తెలంగాణలో ఫస్ట్ డే అదిరే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 5.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 91 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.13 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 66 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 63 లక్షలు, గుంటూరులో రూ. 66 లక్షలు, కృష్ణాలో రూ. 44 లక్షలు, నెల్లూరులో రూ. 29 లక్షలతో కలిపి.. రూ. 9.87 కోట్లు షేర్, రూ. 15.85 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఆంధ్రా, తెలంగాణలో రూ. 9.87 కోట్లు రాబట్టిన 'ఖుషి' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 85 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 4.20 కోట్లు, వేరే భాషలకు సంబంధించిన వెర్షన్లలో రూ. 45 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపితే తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.37 కోట్లు షేర్, రూ. 30.1 కోట్ల గ్రాస్ వచ్చింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ఖుషి' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 15.37 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 38.13 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

కెరీర్‌లోనే బెస్ట్ కలెక్షన్లతో: చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో విజయాన్ని అందుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన 'ఖుషి' అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా తొలి రోజు తెలుగులో రూ. 9.87 కోట్లు రాబట్టి అతడి కెరీర్‌లోనే టాప్ మూవీగా నిలిచింది. ఈ క్రమంలోనే 'లైగర్' రికార్డు రూ. 9.57 కోట్లను బ్రేక్ చేసింది.


Click it and Unblock the Notifications











