Kushi Collections: ఖుషి మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. చిరు రికార్డు మటాష్.. ఆ డిజాస్టర్ కంటే తక్కువే!
టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోలు వస్తున్నా.. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటూ స్టార్లుగా సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకడు. ఆరంభంలోనే ఎన్నో హిట్ చిత్రాలను అందుకున్న అతడు.. మార్కెట్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం పెద్దగా విజయాలను సొంతం చేసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు 'ఖుషి' అనే సినిమాతో వచ్చాడు. దీనికి యూఎస్‌లో వేసిన ప్రీమియర్స్‌లో ఊహించని వసూళ్లు వచ్చాయి. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!
ఖుషి అంటూ వచ్చిన విజయ్: విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమానే 'ఖుషి'. సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందించాడు. ఇందులో జయరాం, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రల్లో నటించారు.

ఖుషికి అలాంటి రెస్పాన్స్‌తో: విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషి' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్‌లో సహా చాలా ప్రాంతాల్లో దీనికి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు థియేటర్లన్నీ ప్రేక్షకుల రాకతో సందడిగా మారాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగానే అవుతున్నాయి. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు మంచిగానే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఓవర్సీస్‌లోనూ డీసెంట్‌గానే: మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే ఓవర్సీస్‌లో 'ఖుషి' మూవీ సందడి మరింత ముందుగానే ప్రారంభం అయింది. అక్కడ ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ చాలా రోజుల ముందే ఓపెన్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే యూఎస్, కెనడాలో చాలా టికెట్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమాకు నార్త్ అమెరికాలోనే ఆశించిన స్థాయిలో స్పందన లభిస్తోంది.

ప్రీమియర్స్ వసూళ్లు ఇలా: శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషి' మూవీకి ఓవర్సీస్‌లో కాస్త తక్కువ స్పందనే వస్తోంది. ముఖ్యంగా యూఎస్‌లో ఈ సినిమాకు 296 లొకేషన్లలో ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. అక్కడ ఈ సినిమా 410K డాలర్లను వసూలు చేసి సత్తా చాటింది. అంటే భారత కరెన్సీలో రూ. 3.38 కోట్లు గ్రాస్‌ను ఈ సినిమా వసూలు చేసింది.
చిరంజీవి రికార్డు మటాష్:ఈ ఏడాది టాలీవుడ్‌లో వచ్చిన సినిమాల్లో కొన్ని మాత్రమే నార్త్ అమెరియా (యూఎస్ అండ్ కెనడా)లో అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ముఖ్యంగా ప్రీమియర్స్ ద్వారా మంచి వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు 'ఖుషి'కి అక్కడ 410K డాలర్లు వచ్చాయి. తద్వారా రీసెంట్ బిగ్గెస్ట్ ఫిల్మ్ 'భోళా శంకర్' రికార్డు (308K డాలర్లు)ను విజయ్ సినిమా బద్దలు కొట్టేసింది.

డిజాస్టర్ కంటే తక్కువగా: విజయ్ దేవరకొండ - సమంత రూత్ ప్రభు కలిసి నటించిన 'ఖుషి' మూవీ ప్రీమియర్స్ కౌంట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఈ లెక్కలు చూసుకుంటే ఈ చిత్రం డిజాస్టర్ ఫిల్మ్ 'లైగర్' (504K డాలర్లు)ను కూడా దాటలేకపోయింది. ప్రీమియర్ షోలకు సంబంధించి రాబోయే రిపోర్టుల్లో 'ఖుషి' కలెక్షన్లు ఇంకా పెరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











