Kushi Business: ఖుషి మూవీకి రికార్డు బిజినెస్.. తెలుగులో 2వ సినిమా.. అన్ని కోట్లు వస్తేనే హిట్

హీరోగా పరిచయం అయిన కొత్తలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకుని తన రేంజ్‌ను పెంచుకున్నాడు రౌడీ గాయ్ విజయ్ దేవరకొండ. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేసిన అతడు.. కొంత కాలంగా పరాజయాలనే చవి చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో 'ఖుషి' అనే సినిమాను చేస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం అదిరిపోయే బిజినెస్‌ను చేసుకుని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ వివరాలపై మీరు కూడా లుక్కేయండి మరి!

ఖుషి అంటూ వస్తున్నాడు: విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోయే చిత్రమే 'ఖుషి'. సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. దీనికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని ఇచ్చాడు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్‌లు కీలక పాత్రలు చేశారు.

Vijay Deverakonda

అలాంటి కథతోనే వస్తుంది: 'ఖుషి' మూవీ ప్యూర్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండు వేరు వేరు మతాలకు చెందిన హీరో హీరోయిన్లు ప్రేమలో పడడం.. ఆ తర్వాత వాళ్లు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం.. కొన్నేళ్లకు మనస్పర్థలతో విడిపోవడం.. వంటి అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత తమదైన నటనలతో ఆకట్టుకోబోతున్నారట.

గ్రాండ్ రిలీజ్... సందడిగా: క్రేజీ కాంబోలో రాబోతున్న 'ఖుషి' మూవీని సెప్టెంబర్ 1వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ సహా ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంతేకాదు, చాలా చోట్ల అప్పుడే టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. ఇక, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని చెప్పనక్కర్లేదు.

Vijay Deverakonda

హక్కులకు భారీ డిమాండ్: ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఖుషి' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఏపీ, తెలంగాణలో బిజినెస్: 'లైగర్' డిజాస్టర్ అయినా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ఖుషి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ బాగానే జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 20 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 41 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: విజయ్ దేవరకొండ - సమంత రూత్ ప్రభు నటించిన 'ఖుషి' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 7 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్లు వ్యాపారం జరిగింది. అంటే రూ. 53.50 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్‌ అవుతుంది.

Vijay Deverakonda

ఒకటి రెండు కూడా అతడే: విజయ్ దేవరకొండ నటించిన 'ఖుషి' మూవీకి ఓవరాల్‌గా రూ. 52.50 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో మీడియం రేంజ్‌ హీరోల్లో అత్యధిక బిజినెస్ చేసిన రెండో చిత్రంగా ఇది నిలిచింది. ఈ క్రమంలోనే నాని 'దసరా' మూవీని దాటేసింది. ఇక, ఈ లిస్టులో మొదటి స్థానంలో విజయ్ దేవరకొండ నటించిన 'లైగర్' రూ. 88.40 కోట్లతో ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X