Kushi Closing Collections ఖుషి మూవీ హిట్టా? ఫట్టా? 54 కోట్ల బిజినెస్.. లాభమా? నష్టమా?

రౌడీ స్టార్ ది విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఖుషి. ఈ సినిమాలోని పాటలకు ట్రెండింగ్‌గా నిలవడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఖుషి రిలీజ్ తర్వాత ఆరంభంలో భారీ కలెక్షన్లు సాధించినా.. అనంతరం అదే జోష్‌ను కొనసాగించలేకపోయింది. ఈ సినిమా బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా థియేట్రికల్‌గా లాభాలను పంచిందా? నష్టాలను ఇచ్చిందా? అనే వివరాల్లోకి వెళితే..

లవ్, ఎంటర్‌టైనింగ్ అంశాలతోపాటు ఓ సెన్సిబుల్ పాయింట్‌తో తెరకెక్కిన ఖుషి మూవీ భారీ వ్యయంతో నిర్మించారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతోపాటు మొత్తంగా 100 కోట్లకుపైగానే అయిందనే ట్రేడ్ వర్గాల రిపోర్టు. ఈ సినిమాకు వచ్చిన బజ్‌కు తగినట్టే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా చేసింది.

Vijay Deverakondas Kushi movie Closing Collections worldwide

ఖుషి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 13.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 5.4 కోట్లు, ఉత్తరాంధ్రలో 9.5 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2.4 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2.10 కోట్లు, గుంటూరులో 2.9 కోట్లు, కృష్ణా జిల్లాలో 2.5 కోట్లు, నెల్లూరు జిల్లాలో 1.2 కోట్ల రూపాయలు, వైజాగ్ 4 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 34.6 కోట్ల బిజినెస్ నమోదు చేసింది.

ఖుషి తెలుగేతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌కు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. కర్ణాటక థియేట్రికల్ హక్కులను 4 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన (రెస్టాఫ్ ఇండియా) హక్కులు 3.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ 5.5 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులు తెలుగు రాష్ట్రాలతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 52.5 కోట్ల బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ను 54 కోట్లకు అటు ఇటుగా నిర్ణయించారు.

Vijay Deverakondas Kushi movie Closing Collections worldwide

ఇక ఖుషి మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్ రైట్స్ అంతా కలిపితే మొత్తంగా 90 కోట్ల రూపాయలు బిజినెస్ నమోదు చేసింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్‌తో కలిపి 142.5 కోట్ల రూపాయలు చేసింది. ఖుషి సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతలకు 40 కోట్ల రూపాయలకు పైగా టేబుల్ ప్రాఫిట్ చేసిందని ట్రేడ్ వర్గాల రిపోర్టు.

Vijay Deverakondas Kushi movie Closing Collections worldwide

ఖుషి మూవీ ఇండియాలో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తోలి రోజు తెలుగులో 14.7 కోట్లు, తమిళంలో 55 లక్షలు, రెండో రోజు తెలుగులో 9.25 కోట్లు, తమిళంలో 65 లక్షలు, మూడో రోజు తెలుగులో 9.45 కోట్లు, తమిళంలో 65 లక్షలు, నాలుగో రోజు తెలుగులో 1.9 కోట్లు, తమిళంలో 25 లక్షలు, ఐదో రోజు తెలుగులో 1.5 కోట్లు, తమిళంలో 25 లక్షలు, ఆరో రోజు 1.35 కోట్లు, తమిళంలో 27 లక్షల రూపాయలు, ఏడో రోజు తెలుగులో 65 లక్షలు, తమిళంలో 10 లక్షలు వసూలు చేసింది. తొలి వారంలో 41 కోట్లకుపైగా తెలుగు, తమిళంలో వసూలు చేసింది. ఆ తర్వాత పెద్దగా కలెక్షన్ల రాబట్టలేకపోయింది. 12 రోజుల తర్వాత ఈ చిత్రం 45 కోట్లు వసూలు చేసింది.

Vijay Deverakondas Kushi movie Closing Collections worldwide

ఇక ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఖుషి మూవీ మొత్తంగా 45 కోట్ల షేర్, 52 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో 18 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. దాంతో ఈ చిత్రం 70 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో ఖుషి భారీ లాభాలను పంచగా, తెలుగు, ఇతర ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ సాధించడానికి కష్టాలు పడింది. మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్‌గా 8 కోట్ల మేర నష్టాలతో ముగిసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X