Leo Day 1 Collections: విజయ్ లియో ర్యాంపేజ్.. తొలిరోజే ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్?
తమిళ దలపతి విజయ్ హీరోగా లోకేషన్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజే భారీ వసూళ్లను వసూలు చేసింది. అక్టోబర్ 19న థియేటర్ వద్దకు వచ్చిన ఈ సినిమా... విడుదల అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా అనిరుధ్ సంగీతం అందించారు. ఇక తొలిరోజు రికార్డు వసూళ్లు రాబట్టింది. ఇక మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.
దళపతి విజయ్ హీరోగా, త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించిన చిత్రం లియో. ఈ సినిమాలో అర్జున్ సర్జాతో పాటు సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ మీనన్, మిస్కిన్ తదితరులు కీలకపాత్రలు నటించారు. ఇక ఈ సినిమాను ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం ఈ సినిమాకు మరింత హైలెట్ గా నిలిచింది.

ఇక లియో బిజినెస్ విషయానికి వస్తే... తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా, నైజాం, సీడెడ్ ప్రాంతాలు కలుపుకుని...రూ. 16 కోట్లు థియేట్రికల్ బిజినెస్ నమోదు చేసుకుంది. ఇక తమిళనాడులో రూ. 100 కోట్లు, కర్నాటకలో రూ. 15.50 కోట్లు, హిందీ ప్లస్ నార్త్ ఇండియా మొత్తంలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 13.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 60 కోట్లు బిజినెస్ పూర్తి చేసుకుంది లియో. దీంతో ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ. 215 కోట్లు బిజినెస్ చేసుకుంది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 210 కోట్లు షేర్ లేదా రూ. 410 కోట్లు గ్రాస్ వసూలుగా నమోదు అయ్యింది.

లోకేష్ కనగరాజ్, విజయ్ లియో సినిమా తమిళ థియేటర్ ఆక్యూపెన్సీ విషయానికి వస్తే... మార్నింగ్ షోస్ 86.35% ఫిల్ అవ్వగా, మధ్యాహ్నం షోస్ 84.58%, సాయంత్రం షోస్ 85.91%, నైట్ షోస్ 90.84% నమోదు అయ్యాయి. ఇక తెలుగు థియేటర్ల ఆక్యూపెన్సీ విషయానికి వస్తే... మార్నింగ్ షోస్ 86.07%, మధ్యాహ్నం షోస్ 83.82%, సాయంత్రం షోస్ 80.29%, నైట్ షోస్ 91.11% ఆక్యూపెన్సీ నమోదు చేసుకున్నాయి. ఇక హిందీ థియేటర్ ఆక్యూపెన్సీ అంతగా నమోదు చేయలేదు. ఉదయం 19.54%, మధ్యాహ్నం 16.60%,సాయంత్రం 15.66%, రాత్రి 24.92% నమోదు చేసుకుంది.
విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా నటించిన లియో సినిమా మొదటి రోజు రికార్డు వసూళ్లు రాబట్టింది. తమిళనాడులో రూ.30కోట్ల గ్రాస్ రాబట్టగా.. తెలుగు రాష్ట్రాల్లో రూ.15కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక కేరళలో రూ.11కోట్ల గ్రాస్ కొల్లగొట్టగా... కర్ణాటకలో రూ.14కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.4కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది. ఇలా ఇండియా వైడ్ గా అన్ని భాషల్లో కలుపుకుని ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద రూ.63 కోట్ల నెట్ వసూలు చేయగా.. రూ.74 కోట్ల గ్రాస్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక లియో సినిమా ఓవర్సీస్ లోనూ దుమ్ము లేపుతోంది. ఏ సినిమాకు రానంత కలెక్షన్లను లియో కొల్లగొడుతోంది. ఇక ఓవర్సీస్ లో లియో కలెక్షన్ల విషయానికి వస్తే.... రూ.66కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. నార్త్ అమెరికాలో లియో 523 లోకేషన్లలో షోను ప్రదర్శించగా... 371k డాలర్స్ వసూలు చేసింది. ప్రిమియర్స్ షోస్ తో 1,80కె డాలర్స్ వసూలు చేయాగా.. అక్కడ మొత్తంగా 2 మిలియన్ల డాలర్స్ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.150కోట్ల గ్రాస్ వసూలు చేసినందని ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











